close

కర్ణాటకదే ముస్తాక్‌ అలీ ట్రోఫీ

ఇండోర్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీని కర్ణాటక కైవసం చేసుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ (84 నాటౌట్‌; 57 బంతుల్లో 6×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో గురువారం జరిగిన ఫైనల్లో కర్ణాటక 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. నౌషద్‌ షేక్‌ (69; 41 బంతుల్లో 5×4, 3×6) రాణించాడు. అభిమన్యు మిథున్‌ (2/24) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. మయాంక్‌, రోహన్‌ కదమ్‌ (60; 39 బంతుల్లో 6×4, 3×6) రాణించడంతో లక్ష్యాన్ని కర్ణాటక 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.