close

షకిబ్‌.. బంగ్లాదేశ్‌ వచ్చెయ్‌!

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ ప్రపంచకప్‌ సన్నాహక శిబిరం కోసం తిరిగి తన దేశానికి వెళ్లే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షకిబ్‌ను వచ్చే వారంలో ఆరంభమయ్యే శిబిరంలో పాల్గొనాల్సిందిగా అడుగుతామని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం తెలిపింది. ‘‘మా శిబిరం ఆరంభం కానుంది. త్వరగా షకిబ్‌ను రమ్మని కబురు పంపమని చెప్పా. అతను దానికి ఎలా స్పందిస్తాడో చూడాలి’’ అని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ తెలిపాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరపున అతను ఒకే మ్యాచ్‌ ఆడాడు. డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో, కేన్‌ విలియమ్సన్‌, రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ నబి లాంటి అత్యుత్తమ విదేశీ ఆటగాళ్లు సన్‌రైజర్స్‌లో ఉండడంతో షకిబ్‌కు తుది జట్టులో ఆడే అవకాశం దక్కట్లేదు. దాంతో ప్రపంచకప్‌ కోసం పూర్తి సన్నద్ధంగా ఉండడం కోసం బంగ్లాదేశ్‌ నుంచి తన వ్యక్తిగత కోచ్‌ మహమ్మద్‌ సలాహుద్దీన్‌ను భారత్‌ రావాలని షకిబ్‌ కోరాడు. ఈ నెల 22 నుంచి బంగ్లాదేశ్‌ జట్టు సన్నాహక శిబిరం ఆరంభం కానుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.