
ఎస్‌ఎస్‌జీఎఫ్ మేడ్చల్- మల్కాజిగిరి విజయం
రాష్ట్రస్థాయి జూనియర్ క్రికెట్
ఈనాడు డిజిటల్, హైదరాబాద్: పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్‌ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డా.అంబేడ్కర్ రాష్ట్రస్థాయి జూనియర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌లో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా జట్టు శుభారంభం చేసింది. బౌలింగ్‌లో కెప్టెన్ పవన్ (4/8) విజృంభించడంతో ఆదివారం కులీకుత్బ్ షా మైదానంలో జరిగిన అండర్-16 లీగ్ మ్యాచ్‌లో మేడ్చల్ 55 పరుగుల తేడాతో ఎస్‌ఎస్‌జీఎఫ్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మేడ్చల్ జిల్లా జట్టు 25 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. ఆ జట్టులో వినీశ్ (31) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో వాన్ష్ (3/14), రిత్విక్ యాదవ్ (2/12), ఆసిమ్ (2/15) ఆకట్టుకున్నారు. అనంతరం ఛేదనలో పవన్ ధాటికి హైదరాబాద్ జట్టు 13.3 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. బౌలింగ్‌లో సత్తాచాటిన వాన్ష్ (30) బ్యాటింగ్‌లోనూ మెరిశాడు.
ఎస్‌ఎస్‌జీఎఫ్ మేడ్చల్- మల్కాజిగిరి: 133/9 (వినీశ్ 31, వాన్ష్ 3/14, రిత్విక్ యాదవ్ 2/12, ఆసిమ్ 2/15), ఎస్‌ఎస్‌జీఎఫ్ హైదరాబాద్: 78 (వాన్ష్ 30, పవన్ 4/8)
ప్రధానాంశాలు
దేవతార్చన

- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి