close
పాండ్య పంచ్‌

బెంగళూరుపై ముంబయి గెలుపు
ముంబయి

బెంగళూరుతో మ్యాచ్‌.. ముంబయి లక్ష్యం 172 పరుగులు.. ఒక దశలో ఆ జట్టు స్కోరు 11 ఓవర్లలో   108/3.. ఇంకా 54 బంతుల్లో 64 పరుగులు చేస్తే  చాలు.. కానీ బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ముంబయి ఆఖరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సి వచ్చింది.  ఈ స్థితిలో కళ్లుచెదిరేలా ఆడిన హార్దిక్‌ పాండ్య (37 నాటౌట్‌; 16 బంతుల్లో 5×4, 2×6).. ఒక ఓవర్‌ మిగిలుండగానే ముంబయిని గెలిపించాడు.

ముంబయి మళ్లీ గాడిలో పడింది.. గత పరాజయం నుంచి కోలుకుని బెంగళూరుపై స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి 5 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. మొదట బెంగళూరు 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. మలింగ (4/31) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. డివిలియర్స్‌ (75; 51 బంతుల్లో 6×4, 5×6) టాప్‌ స్కోరర్‌. డికాక్‌ (40; 26 బంతుల్లో 5×4, 2×6) రాణించడంతో లక్ష్యాన్ని ముంబయి 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

రాణించిన డికాక్‌: 172 పరుగుల ఛేదనలో ముంబయికి ఓపెనర్లు రోహిత్‌ (28; 19 బంతుల్లో 2×4, 2×6), డికాక్‌ (40; 26 బంతుల్లో 5×4, 2×6) శుభారంభం ఇచ్చారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 70 పరుగులు జత చేయడంతో ముంబయి విజయం దిశగా అడుగులు వేసింది. అయితే మొయిన్‌ అలీ (2/18) ఒకే ఓవర్లో రోహిత్‌, డికాక్‌ను ఔట్‌ చేసి ముంబయిని దెబ్బ కొట్టాడు. అయితే సూర్యకుమార్‌ (29; 23 బంతుల్లో 2×4, 1×6), ఇషాన్‌ కిషన్‌ (21; 9 బంతుల్లో 3×6) ధాటిగా ఆడడంతో ముంబయి ఒక దశలో 104/2తో లక్ష్యం దిశగా సాగింది. అయితే చాహల్‌ సూర్యకుమార్‌, ఇషాన్‌ను ఔట్‌ చేసి ముంబయి జోరుకు బ్రేకులు వేశాడు. ఈ స్థితిలో ధాటిగా ఆడిన హార్దిక్‌  రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమైన స్థితిలో వరుసగా 6, 4 4, 6 కొట్టి ముంబయిని విజయపథంలో నడిపించాడు.

మెరిసిన డివిలియర్స్‌, అలీ: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఆరంభంలో కోహ్లి (8) వికెట్‌ కోల్పోయింది. ఈ స్థితిలో డివిలియర్స్‌, పార్థివ్‌ (28; 20 బంతుల్లో 4×4, 1×6)తో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్‌ నిర్మించాడు. పార్థివ్‌ను పాండ్య ఔట్‌ చేసి బెంగళూరుకు బ్రేక్‌ వేశాడు. ఐతే డివిలియర్స్‌కు మొయిన్‌ అలీ (50; 32 బంతుల్లో 1×4, 5×6) జత కలవడంతో ఆర్‌సీబీ జోరు అందుకుంది. 19 ఓవర్లకు బెంగళూరు స్కోరు 162/4. అయితే చివరి ఓవర్‌ తొలి బంతికి సిక్స్‌ కొట్టిన డివిలియర్స్‌.. రెండో బంతికి రనౌట్‌ కాగా... అక్షదీప్‌ నాథ్‌ (2), నేగి (0) వికెట్లను మలింగ ఖాతాలో వేసుకోవడంతో బెంగళూరు మరింత స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: పార్థివ్‌ పటేల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) హార్దిక్‌ పాండ్య 28; కోహ్లి (సి) డికాక్‌ (బి) బెరెన్‌డార్ఫ్‌ 8; డివిలియర్స్‌ రనౌట్‌ 75; మొయిన్‌ అలీ (సి) హార్దిక్‌ (బి) మలింగ 50; స్టాయినిస్‌ (సి) రోహిత్‌ (బి) మలింగ 0; అక్షదీప్‌ నాథ్‌ (సి) డికాక్‌ (బి) మలింగ 2; పవన్‌ నేగి (సి) డికాక్‌ (బి) మలింగ 0; ఉమేశ్‌ నాటౌట్‌ 0; సిరాజ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8;
మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171;
వికెట్ల పతనం: 1-12, 2-49, 3-144, 4-151, 5-169, 6-169, 7-169;
బౌలింగ్‌: బెరెన్‌డార్ఫ్‌ 4-0-49-1; మలింగ 4-0-31-4; బుమ్రా 4-1-22-0; హార్దిక్‌ పాండ్య 3-0-21-1; రాహుల్‌ చాహర్‌   4-0-31-0; కృనాల్‌ పాండ్య 1-0-10-0

ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ ఎల్బీ (బి) అలీ 40; రోహిత్‌ (బి) అలీ 28; సూర్యకుమార్‌ (సి) సైని (బి) చాహల్‌ 29; ఇషాన్‌ కిషన్‌ (స్టంప్డ్‌) పార్థివ్‌ (బి) చాహల్‌ 21; కృనాల్‌ (సి) మిలింద్‌ (బి) సిరాజ్‌ 11; హార్దిక్‌ నాటౌట్‌ 37; పొలార్డ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6
మొత్తం: (19 ఓవర్లలో 5 వికెట్లకు) 172;
వికెట్ల పతనం: 1-70, 2-71, 3-104,   4-129, 5-148;
బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 2-0-25-0; సైని 3-0-34-0; సిరాజ్‌ 2-0-21-1; చాహల్‌ 4-0-27-2; నేగి    4-0-47-0; మొయిన్‌ అలీ 4-0-18-2

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.