Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 96576
      [news_title_telugu_html] => 

వేటగాళ్లు వీళ్లే

[news_title_telugu] => వేటగాళ్లు వీళ్లే [news_title_english] => [news_short_description] => వన్డే ప్రపంచకప్‌.. ప్రపంచ క్రికెట్లో అత్యున్నత టోర్నీ. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ప్రతి క్రికెట్‌ అభిమానీ ఉత్కంఠగా ఎదురు చూస్తాడు. ప్రపంచకప్‌ ఆడాలని ప్రతి క్రికెటర్‌ కల కంటాడు. ఐతే  కోట్లలో క్రికెటర్లుండే భారత దేశంలో ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవడమంటే మాటలా? ఈసారికి ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న 15 మంది ఎవరో తేలిపోయింది. ఉత్కంఠకు తెరదించుతూ సోమవారం భారత ప్రపంచకప్‌ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => https://www.youtube.com/embed/5k5-lNFUzRc [news_videoinfo] => https://www.youtube.com/embed/5k5-lNFUzRc [news_sections] => ,4, ) )
వేటగాళ్లు వీళ్లే - EENADU
close
వేటగాళ్లు వీళ్లే

ప్రపంచకప్‌కు భారత జట్టు ఎంపిక
రాయుడు, పంత్‌లకు మొండిచేయి
శంకర్‌, కార్తీక్‌, జడేజా, రాహుల్‌లకు చోటు
ముంబయి

వన్డే ప్రపంచకప్‌.. ప్రపంచ క్రికెట్లో అత్యున్నత టోర్నీ. నాలుగేళ్లకోసారి వచ్చే ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ప్రతి క్రికెట్‌ అభిమానీ ఉత్కంఠగా ఎదురు చూస్తాడు. ప్రపంచకప్‌ ఆడాలని ప్రతి క్రికెటర్‌ కల కంటాడు. ఐతే  కోట్లలో క్రికెటర్లుండే భారత దేశంలో ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవడమంటే మాటలా? ఈసారికి ఈ అరుదైన అవకాశం దక్కించుకున్న 15 మంది ఎవరో తేలిపోయింది. ఉత్కంఠకు తెరదించుతూ సోమవారం భారత ప్రపంచకప్‌ జట్టును ప్రకటించింది ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ. చాలా స్థానాల విషయంలో ఇప్పటికే అందరికీ ఒక అవగాహన ఉండగా.. ఇంకో మూడు నాలుగు బెర్తుల విషయంలో ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. ప్రపంచకప్‌ జట్టులో చోటుపై ఎంతో ఆశతో ఉన్న అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌లకు మొండిచేయి చూపించిన సెలక్టర్లు.. విజయ్‌ శంకర్‌, దినేశ్‌ కార్తీక్‌, రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌లకు అవకాశమిచ్చారు.

‘‘టీమ్‌ఇండియా జట్టు సమతూకంగా ఉంది. ప్రపంచకప్‌ గెలవగలిగిన జట్లలో కోహ్లీసేన ఒకటి. సన్‌రైజర్స్‌ తరఫున ఆడుతున్న భువనేశ్వర్‌, విజయ్‌ శంకర్‌లను చాలా దగ్గరి నుంచి  గమనించా. మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రపంచకప్‌లో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. జట్టు విజయాల్లో వీరెంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు’’

- వీవీఎస్‌ లక్ష్మణ్‌

‘‘ప్రపంచ కప్‌కు ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంగ్లాండ్‌ వాతావరణం నా బౌలింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. పరిస్థితుల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటా. ప్రపంచ కప్‌కు ముందు ఐపీఎల్‌ రూపంలో మంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించింది. నా కెరీర్‌లో ఇది రెండో ప్రపంచ కప్‌. అత్యుత్తమంగా రాణిస్తానన్న ఆత్మవిశ్వాసం ఉంది’’

- భువనేశ్వర్‌

2019 వన్డే ప్రపంచకప్‌ వేటకు వెళ్లే భారత జట్టు ఏదో తేలిపోయింది. సోమవారం ముంబయిలో సమావేశమైన సెలక్షన్‌ కమిటీ.. విరాట్‌ కోహ్లి నేతృత్వంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.  ఈ జట్టులోని ఆటగాళ్లందరూ గత కొన్ని నెలల్లో భారత జట్టుకు ఆడిన వాళ్లే. కొత్త ముఖాలు, అనూహ్యంగా జట్టులోకి వచ్చిన వాళ్లెవ్వరూ లేరు. ఐతే కొన్ని నెలల కిందటి వరకు చోటు ఖాయంగా కనిపించిన అంబటి రాయుడికి, రెండో వికెట్‌ కీపర్‌ స్థానానికి చక్కగా సరిపోతాడనుకున్న రిషబ్‌ పంత్‌కు సెలక్టర్లు మొండి చేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. వీరిని పక్కన పెట్టి.. ఫామ్‌ కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ విజయ్‌ శంకర్‌, దినేశ్‌ కార్తీక్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజాలకు అవకాశమిచ్చారు. మిగతా వాళ్లందరూ జట్టులో రెగ్యులర్‌ ఆటగాళ్లే. నలుగురు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌ (కోహ్లి, రోహిత్‌, ధావన్‌, రాహుల్‌), ఇద్దరు వికెట్‌ కీపింగ్‌ బ్యాట్స్‌మెన్‌ (ధోని, కార్తీక్‌), ఇద్దరు స్పిన్నర్లు (చాహల్‌, కుల్‌దీప్‌), ముగ్గురు ఫాస్ట్‌బౌలర్లు (బుమ్రా, షమి, భువనేశ్వర్‌), ఇద్దరు పేస్‌ ఆల్‌రౌండర్లు (పాండ్య, శంకర్‌), ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లు (జాదవ్‌, జడేజా)లను సెలక్టర్లు ఎంచుకున్నారు. సమావేశంలో సెలక్టర్లతో పాటు టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా పాల్గొన్నాడు. మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సెలక్టర్లు జట్టు ఎంపిక కోసం పరిగణనలో ఉన్న ఆటగాళ్లందరి గణాంకాలతో కూడిన ప్రెజెంటేషన్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇంగ్లాండ్‌ వేదికగా  పది జట్లు పోటీ పడే ప్రపంచకప్‌ మే 30న ఆరంభం కానుంది. జట్టులో మార్పులు చేసుకోవడానికి మే 23 వరకు అవకాశముంది. ఐతే ఫామ్‌ ఆధారంగా జట్టును మార్చడం సందేహమే. ఎవరైనా గాయపడితే వేరే ఆటగాళ్లను ఎంచుకోవచ్చు.

విలేకరుల సమావేశంలో ఎమ్మెస్కే ప్రసాద్‌, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి

‘‘2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత మిడిలార్డర్లో కార్తీక్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే లాంటి వాళ్లను ప్రయత్నించి చూశాం. రాయుడికి కూడా అవకాశాలిచ్చాం. ఐతే విజయ్‌ శంకర్‌ మూడు రకాలుగా ఉపయోగపడతాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ కూడా చేయగలడు. ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో బంతితో అతను ఉపయోగపడగలడు. శంకర్‌ చక్కటి ఫీల్డర్‌ కూడా. ఇవే అతడికి కలిసొచ్చాయి. అతడిని నాలుగో స్థానంలో ఆడించాలన్నది మా ఆలోచన. కార్తీక్‌, జాదవ్‌ కూడా అందుబాటులో ఉండటంతో నాలుగో స్థానానికి ప్రత్యామ్నాయాలకు లోటు లేదు. రాయుడికి ఏం ప్రతికూలం అయిందనే దాని కంటే శంకర్‌కు ఏం కలిసొచ్చిందనేది చూడాలి. కార్తీక్‌, పంత్‌ల్లో ఎవరిని రెండో వికెట్‌ కీపర్‌గా ఎంచుకోవాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించాం. ఐతే క్వార్టర్స్‌ లేదా సెమీస్‌ లాంటి కీలక మ్యాచ్‌కు ముందు ధోని గాయపడితే.. వికెట్‌ కీపింగ్‌ చాలా కీలకమవుతుంది. అందుకే అనుభవజ్ఞుడైన కార్తీక్‌ను ఎంచుకున్నాం. ఒత్తిడిలో మ్యాచ్‌లు ముగించిన రికార్డుండటం కూడా కార్తీక్‌కు కలిసొచ్చింది. చోటు దక్కనందుకు పంత్‌ దురదృష్టవంతుడే. ప్రపంచకప్‌ రెండో అర్ధంలో పిచ్‌లు పొడిబారే అవకాశముంటుంది. అలాంటపుడు స్పిన్‌ వేయగల ఆల్‌రౌండర్‌ అవసరమని జడేజాను ఎంచుకున్నాం’’

- ఎమ్మెస్కే ప్రసాద్‌, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌

తుది జట్టులో ఎవరు?

ప్రపంచకప్‌ కోసం జట్టులోకి ఎంపిక చేసింది 15 మందినైనా.. తుది జట్టులో ఉండే 11 మందిపై ఇప్పటికే జట్టు యాజమాన్యం ఒక అంచనాకు ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ 11 మంది ఎవరయ్యే అవకాశముందో చూద్దాం. బ్యాటింగ్‌లో తొలి మూడు స్థానాల్లో రోహిత్‌, ధావన్‌, కోహ్లి పక్కా. వికెట్‌ కీపర్‌గా ధోని ఖాయం. అతను ఐదో స్థానంలో ఆడే అవకాశముంది. తుది జట్టులో ఇద్దరు స్పెషలిస్టు ఫాస్ట్‌బౌలర్లకే చోటు దక్కొచ్చు. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే ఆ ఇద్దరు బుమ్రా, షమిలే అయ్యే అవకాశముంది. మూడో పేసర్‌గా సేవలందించగల ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కచ్చితంగా జట్టులో ఉంటాడు. ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లను ఆడించాలనుకుంటే చాహల్‌, కుల్‌దీప్‌లు చోటు ఖాయం. లేదంటే వీరిలో ఒకరికే అవకాశముంటుంది. బ్యాటింగ్‌లో నాలుగో స్థానం విషయంలో సందిగ్ధత కొనసాగుతోంది. ఆ స్థానంలో శంకర్‌ను ఆడించే అవకాశాలున్నాయి. అతను విఫలమైతే.. రాహుల్‌ను ఎంచుకోవచ్చు. ఆరో స్థానం జాదవ్‌దే కావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌లకు తుది జట్టులో చోటుండకపోవచ్చు. స్పెషలిస్టు బ్యాట్స్‌మనే కావాలనుకుంటే శంకర్‌ బదులు రాహుల్‌, బ్యాటింగ్‌ కూడా చేయగల స్పిన్నర్‌ కావాలనుకుంటే చాహల్‌, కుల్‌దీప్‌ల్లో ఒకరి బదులు జడేజా జట్టులోకి వస్తారు. ధోని గాయపడితేనే కార్తీక్‌కు అవకాశముంటుంది. భువి పరిస్థితి కూడా అంతే.

పంత్‌ను ఎందుకు తీసుకోలేదో!

‘‘పంత్‌ ఫామ్‌ ప్రకారం చూస్తే అతను ప్రపంచకప్‌ జట్టులో లేకపోవడం ఒకింత ఆశ్చర్య కలిగించేదే. ఐపీఎల్‌లోనే కాక అంతకుముందు కూడా అతను చక్కటి ప్రదర్శన చేశాడు. వికెట్‌ కీపింగ్‌లోనూ అతనెంతో మెరుగయ్యాడు. టాప్‌-6లో పంత్‌ లాంటి ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ ఉండటం జట్టుకు మేలు చేస్తుంది. కార్తీక్‌ వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యమే అతడికి చోటు తెచ్చిపెట్టినట్లుంది. శంకర్‌ మెరుగైన బ్యాట్స్‌మన్‌, ఉపయుక్తమైన బౌలర్‌, చక్కటి ఫీల్డర్‌ కూడా. గత ఏడాది కాలంలో ఎంతో మెరుగయ్యాడు. అతను జట్టుకు ఉపయోగపడతాడు’’

- సునీల్‌ గావస్కర్‌

 

‘‘ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కడం అంటే కల నిజమైనట్లుగా ఉంది. ఐపీఎల్‌లో నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సన్‌రైజర్స్‌ జట్టులో ప్రపంచకప్‌ గెలిచిన ఆటగాళ్లు కొందరున్నారు. ఈ మెగా టోర్నీలో ఆడేటపుడు ఒత్తిడిని తట్టుకోవడమెలాగో, కప్‌ నెగ్గడానికి ఏం చేయాలో అడిగి తెలుసుకున్నాను. నా బలాలకు ఇంగ్లాండ్‌ పరిస్థితులు నప్పుతాయి’’

- విజయ్‌ శంకర్‌

వీళ్లెందుకున్నారు.. వాళ్లెందుకు లేరు?

ప్రపంచకప్‌ కోసం ఎప్పుడు జట్టును ఎంపిక చేసినా.. కొన్ని నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తడం సహజం. ఐతే ఈసారి ఈ ప్రశ్నలు కాస్త ఎక్కువే ఉన్నాయి. అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌లకు చోటు దక్కకపోవడం అన్యాయమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో కార్తీక్‌, శంకర్‌, రాహుల్‌, జడేజాల ఎంపిక ప్రశ్నలకు తావిస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆరుగురిలో ఎవ్వరూ కూడా గత కొన్ని నెలల్లో నిలకడగా రాణించలేదు. అందరూ తడబడ్డ వాళ్లే. కాబట్టి ఫామ్‌ ఆధారంగానే రాయుడిని పక్కన పెట్టామంటే అతడికి అన్యాయం చేసినట్లే. ఉన్నంతలో మిగతా వాళ్ల కంటే అతను మెరుగైన ప్రదర్శనే చేశాడు. రెండేళ్ల తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన రాయుడు.. నాలుగో స్థానంలో నిలకడగా రాణించాడు. చివరగా సొంతగడ్డపై ఆస్ట్రేలియా సిరీస్‌లో మాత్రమే విఫలమయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లోనూ ఇబ్బంది పడుతున్నాడు. రాయుడితో పోలిస్తే రాహుల్‌, శంకర్‌లే ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో ఎక్కువ ఉపయోగపడతారన్నది సెలక్టర్ల ఉద్దేశంగా కనిపిస్తోంది. రాహుల్‌ అంతర్జాతీయ ఫామ్‌ బాగా లేకున్నా.. ప్రస్తుతం ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. అతడికి ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవముంది. శంకర్‌ పేస్‌ బౌలింగ్‌ ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో పనికొస్తుందని అతడికి అవకాశం ఇచ్చినట్లున్నారు. ఐతే శంకర్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌.. ఎందులోనూ నిలకడగా రాణించింది లేదు. ఇక పంత్‌ను కాదని కార్తీక్‌ను ఎంచుకోవడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. ఏడాదిగా కార్తీక్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేదు. టెస్టుల్లో సత్తా చాటి ఈ మధ్యే వన్డే జట్టులోకి వచ్చిన పంత్‌ కూడా అంతగా ఏమీ రాణించలేదు కానీ.. విధ్వంసక బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను మలుపు తిప్పగల సత్తా అతడి సొంతం. ఐతే పంత్‌తో పోలిస్తే అనుభవం, వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యం కార్తీక్‌కు కలిసొచ్చాయి. ఇక చాన్నాళ్ల తర్వాత జట్టులోకొచ్చిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ జడేజా.. ఇటు బ్యాటింగ్‌లో, అటు బౌలింగ్‌లో రాణించలేకపోయాడు. అయినా  అవకాశం దక్కడం ఆశ్చర్యమే.

2007లో.. 2019లో.. ఆ ఇద్దరే!

2015 ప్రపంచకప్‌కు భారత జట్టులో ఉన్న 15 మందిలో ఏడుగురు 2019 ప్రపంచకప్‌కూ అవకాశం దక్కించుకున్నారు. కోహ్లి, ధోని, రోహిత్‌, ధావన్‌, జడేజా, షమి, భువనేశ్వర్‌ ఈసారి కూడా జట్టులో చోటు నిలుపుకున్నారు. గత టోర్నీకి జట్టులో ఉన్న రైనా, అశ్విన్‌, రహానె, రాయుడు, బిన్నీ, అక్షర్‌ పటేల్‌, మోహిత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మలకు ఈసారి అవకాశం దక్కలేదు. 2011 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో ఉన్న ఇప్పటి ఆటగాళ్లు ధోని, కోహ్లి మాత్రమే. దానికి ముందు 2007 టోర్నీలో ఆడిన ధోని, దినేశ్‌ కార్తీక్‌ ఇప్పటికీ జట్టులో ఉండటం విశేషం. ధోని వరుసగా నాలుగో ప్రపంచకప్‌ ఆడనున్నాడు. అతడి తర్వాత అత్యధిక ప్రపంచకప్‌ అనుభవం కోహ్లీదే. అతడికిది మూడో టోర్నీ. గత రెండు పర్యాయాలూ ధోనీనే కెప్టెన్‌ కాగా.. ఇప్పుడు విరాట్‌ సారథ్యంలో జట్టు బరిలోకి దిగుతోంది.

అప్పుడు లక్ష్మణ్‌.. ఇప్పుడు అంబటి

అది 2003 ప్రపంచకప్‌ నాటి సంగతి. అప్పటికి లక్ష్మణ్‌ టెస్టుల్లోనే కాక వన్డేల్లోనూ రాణిస్తున్నాడు. కొన్ని నెలల ముందు వెస్టిండీస్‌ సిరీస్‌లో చక్కటి ప్రదర్శన చేశాడు. ఐతే తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనలో మాత్రం విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లో మిగతా ఆటగాళ్లూ ఏమంత గొప్పగా రాణించలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ జట్టులో లక్ష్మణ్‌ కచ్చితంగా ఉంటాడనే అనుకున్నారంతా. కానీ అప్పటి సెలక్షన్‌ కమిటీ అతడికి పెద్ద షాకిచ్చింది. లక్ష్మణ్‌ను కాదని.. దినేశ్‌ మోంగియాకు జట్టులో చోటిచ్చింది. అతడి ప్రదర్శన చూస్తే పేలవం.  ఈ నిర్ణయాన్ని అందరూ తప్పుబట్టారు. ప్రపంచకప్‌లో మోంగియా సాధించిందేమీ లేదు. అప్పుడు లక్ష్మణ్‌ లాగే ఇప్పుడు తెలుగువాడే అయిన అంబటి రాయుడికీ అన్యాయం జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మాత్రమే రాయుడు విఫలమయ్యాడు. అంతకుముందు సిరీస్‌ల్లో రాణించినా అతడికి చోటు దక్కలేదు.

జట్టు

కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, విజయ్‌ శంకర్‌, ధోని (వికెట్‌ కీపర్‌), కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి.


 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.