close
పైకెగిరిన ఉప్పల్‌ స్టేడియం పైకప్పు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సోమవారం భారీ గాలులతో కూడిన వాన హైదరాబాద్‌ను అల్లకల్లోలం చేసింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం కూడా ఈ గాలులకు దెబ్బతిన్నది. అధిక వేగంతో వీచిన ఈ గాలుల ధాటికి కొన్నిచోట్ల మైదానం పైకప్పు ఎగిరిపోయింది. ప్రస్తుతం ఈ మైదానం ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది. ఆదివారమే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైడ్‌రైడర్స్‌ మధ్య ఈ మైదానంలో మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మళ్లీ వచ్చే సోమవారం ఈ మైదానంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో సన్‌రైజర్స్‌ తలపడనుంది.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.