Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113249
            [news_title_telugu_html] => 

‘12’లో పదనిసలు!

[news_title_telugu] => ‘12’లో పదనిసలు! [news_title_english] => [news_short_description] => ఐపీఎల్‌.. క్రికెట్‌ ప్రియుల ఫేవరెట్‌ లీగ్‌. ప్రతి ఏడాదీ లీగ్‌ జరిగే నెలన్నర అభిమానులకు కనువిందే. విరామం లేని వినోదంతో ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
‘12’లో పదనిసలు! - EENADU
close
‘12’లో పదనిసలు!

ఐపీఎల్‌.. క్రికెట్‌ ప్రియుల ఫేవరెట్‌ లీగ్‌. ప్రతి ఏడాదీ లీగ్‌ జరిగే నెలన్నర అభిమానులకు కనువిందే. విరామం లేని వినోదంతో ఉర్రూతలూగించే ఈ టోర్నీ ప్రతి సీజన్లోనూ ఎన్నో జ్ఞాపకాల్ని విడిచి వెళ్తుంది. ఈసారి కూడా అలాంటి జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. మరి ఐపీఎల్‌-12లె పదనిసలేంటో చూద్దామా!

కసితో కొట్టారు

హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌.. మూడు నెలల కిందట ప్రతికూల కారణాలతో వార్తల్లో నిలిచారీ భారత యువ ఆటగాళ్లు. ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సస్పెన్షన్‌కు గురైన పాండ్య, రాహుల్‌.. ఆ వివాదం నుంచి బయటపడి తామేంటో చాటి చెప్పడానికి ఐపీఎల్‌నే వేదికగా చేసుకుందీ జోడీ. ముంబయి తరఫున పాండ్య, పంజాబ్‌ తరఫున రాహుల్‌ ఈ సీజన్లో చక్కటి ప్రదర్శన చేశారు. పాండ్య బ్యాటుతో, బంతితో తన ఐపీఎల్‌ కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. రాహుల్‌ సైతం కొన్ని కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్లేఆఫ్‌ చేరడంలో పంజాబ్‌ విఫలమైనప్పటికీ.. ఈ సీజన్లో రాహుల్‌ మాత్రం హిట్టే.

వీళ్లు మారారు.. వాళ్లు అలాగే

సారి ఐపీఎల్‌లో అందరినీ ఆశ్చర్యపోయేలా చేసిన జట్టు దిల్లీ క్యాపిటల్స్‌. లీగ్‌లో ఆ జట్టు విఫల చరిత్ర గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి జట్టు ఈసారి ముంబయి, చెన్నైలతో సమానంగా తొమ్మిది విజయాలతో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌ బెర్తు కైవసం చేసుకోవడం విశేషం. శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, రబాడ, పృథ్వీ షా లాంటి కుర్రాళ్ల ప్రతిభతో ఆ జట్టు అద్భుత విజయాలు సాధించింది. చాలా సీజన్ల నుంచి మార్పులు చేసి చేసి అలసిపోతున్న దిల్లీ.. ఈసారి పేరును కూడా మార్చుకుని బరిలోకి దిగింది. పాంటింగ్‌, గంగూలీ లాంటి దిగ్గజాల శిక్షణలో కుర్రాళ్లు చక్కటి ప్రదర్శనతో జట్టును ముందుకు తీసుకెళ్లారు. కానీ కోహ్లి జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాత్రం ఈసారి కూడా మారలేదు. వరుసగా ఆరు పరాజయాలతో టోర్నీని చెత్తగా ఆరంభించిన ఆ జట్టు.. తర్వాత కొంచెం పుంజుకున్నా ఫలితం లేకపోయింది. మిగతా జట్లన్నింటకంటే ముందే ప్లేఆఫ్‌ రేసుకు దూరమై అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.

ఏం బాదుడు బాబోయ్‌

పీఎల్‌లో ప్రతిసారీ అప్పటికే పేరున్న ఆటగాళ్లు కొందరు ఇలా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తే.. ఏ సీజన్‌కు ఆ సీజన్లో కొందరు కొత్త హీరోలు కూడా వస్తుంటారు. ఈసారి ఆండ్రి రసెల్‌ అలాగే హీరో అయ్యాడు. అసాధారణ బ్యాటింగ్‌ విన్యాసాలతో ఈ సీజన్లో కొన్ని మ్యాచ్‌ల్లో రసెల్‌ చెలరేగిన తీరును చాలా కాలం గుర్తుంచుకుంటారు ఐపీఎల్‌ ప్రేమికులు. మొదట్లో అతడి మెరుపులు చూశాక స్టేడియాలకు అతడి కోసమే అభిమానులు పోటెత్తడం మొదలైంది. చివర్లో కాస్త నిరాశ పరిచినప్పటికీ.. అంతకుముందు బెంగళూరుతో పోరు సహా కొన్ని మ్యాచ్‌లో అతడి విధ్వంసాలు వీక్షకుల్ని ఉర్రూతలూగించాయి.

ఆ బంతి.. ఆ షాట్‌

ప్రతి ఐపీఎల్‌లోనూ కొన్ని మెరుపు బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రదర్శనలు చూస్తాం. కొన్ని వికెట్లు.. షాట్లు అలా మనసులో ముద్రించుకునిపోతాయి. ఈసారి కూడా అలాంటి మెరుపులున్నాయి. సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన కోల్‌కతా-దిల్లీ మ్యాచ్‌లో రబాడ తీసిన ఒక వికెట్‌ను అంత సులువుగా అభిమానులు మరిచిపోలేరు. కోల్‌కతా 10 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా.. విధ్వంసక రసెల్‌ క్రీజులో నిలవడంతో మ్యాచ్‌ కోల్‌కతాదే అనుకున్నారంతా. కానీ కళ్లు చెదిరే యార్కర్‌తో రసెల్‌ను బౌల్డ్‌ చేసి నైట్‌రైడర్స్‌కు షాకిచ్చాడు రబాడ. ఇక పంజాబ్‌ బౌలర్‌ షమి బౌలింగ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మన్‌ డివిలియర్స్‌ బాదిన సిక్సర్‌ విస్మయానికి గురి చేసేదే. మీదికి వస్తున్న ఫుల్‌టాస్‌ బంతిని ఆడబోతూ బ్యాట్‌పై ఒక చేతిని వదిలేయడమే కాక, షాట్‌ ఆడిన వైపునకు వ్యతిరేక దిశలో తిరిగేశాడు. కానీ బ్యాట్‌ స్వీట్‌ స్పాట్‌లో తగిలిన బంతి ఏకంగా స్టేడియం పైకప్పు మీద పడింది. నమ్మశక్యంగా అనిపించని ఈ షాట్‌ ఆడటం ఏబీకే చెల్లింది.

అశ్విన్‌, ధోని.. అవేం పనులు?

 ఐపీఎల్‌లో కొన్ని వివాదాలు, ఆశ్చర్యకర ఉదంతాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎప్పుడూ చాలా ప్రశాంతంగా కనిపించే చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని.. ఒక మ్యాచ్‌లో సహనం కోల్పోయాడు. రాజస్థాన్‌తో చివరి బంతి దాకా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అంపైర్‌ ఆఖరి ఓవర్లో అంపైర్‌ ముందు నోబాల్‌ ఇచ్చి తర్వాత వెనక్కి తీసుకోవడంతో ధోని ఆగ్రహించాడు. పెవిలియన్‌లో ఉన్నవాడు పిచ్‌ వద్దకు వచ్చి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.  ఇక లీగ్‌ ఆరంభంలో అశ్విన్‌ మన్కడింగ్‌ చర్చనీయాంశమైంది. రాజస్థాన్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ను అతను వివాదాస్పద రీతిలో ఔట్‌ చేసి తీవ్ర విమర్శలెదుర్కొన్నాడు.
- ఈనాడు క్రీడావిభాగం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.