close
359.. 44.5 ఓవర్లలోనే ఉఫ్‌! 

ప్రపంచకప్‌ ముంగిట ఇంగ్లాండ్‌ సంచలనం

బ్రిస్టల్‌: వన్డేల్లో 359 పరుగుల లక్ష్యమంటే ఏ జట్టు మీదైనా, ఏ పిచ్‌పై అయినా ఛేదన కష్టమే. ఐతే బలమైన బౌలింగ్‌ దళమున్న పాకిస్థాన్‌పై అంతటి లక్ష్యాన్ని ఇంకో 5.1 ఓవర్లు మిగిలుండగానే అలవోకగా ఛేదించి సంచలనం సృష్టించింది ఇంగ్లిష్‌ జట్టు. భీకరమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉన్న ఇంగ్లాండ్‌ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుని ప్రపంచకప్‌ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (128; 93 బంతుల్లో 15×4, 5×6), జేసన్‌ రాయ్‌ (76; 55 బంతుల్లో 8×4, 4×6) తొలి వికెట్‌కు 17.3 ఓవర్లలోనే 159 పరుగులు జోడించి ఛేదనలో జట్టుకు ఘనమైన ఆరంభాన్నిచ్చారు. తర్వాత రూట్‌ (43), స్టోక్స్‌ (37), మొయిన్‌ అలీ (46 నాటౌట్‌) కూడా రాణించడంతో ఇంగ్లాండ్‌ సునాయాస విజయాన్నందుకుంది. అంతకుముందు ఇమాముల్‌ హక్‌ (151; 131 బంతుల్లో 16×4, 1×6) భారీ శతకం సాయంతో పాక్‌ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. వన్డేల్లో 150+ స్కోరు చేసిన పిన్న వయస్కుడిగా కపిల్‌ రికార్డును ఇమాముల్‌ బద్దలుకొట్టాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.