close
వరుణుడు పొంచే ఉన్నాడు..

కార్డిఫ్‌: ప్రపంచకప్‌ కోసం క్రికెట్‌ అభిమానులే కాదు.. వరుణుడూ సిద్ధమవుతున్నట్లున్నాడు. అసలు టోర్నీ ఆరంభానికి ముందే ప్రభావం చూపించడం మొదలు పెట్టాడు. వర్షం కారణంగా ఆదివారం రెండు సన్నాహక మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోయాయి. కార్డిఫ్‌లో పాకిస్థాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌, బ్రిస్టల్‌లో దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ మ్యాచ్‌ రద్దయ్యాయి. విండీస్‌తో మ్యాచ్‌లో వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి దక్షిణాఫ్రికా 12.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 95 పరుగులు చేసింది. ఆమ్లా (51 నాటౌట్‌), డికాక్‌ (37 నాటౌట్‌) రాణించారు. బంగ్లా-పాక్‌ మ్యాచ్‌లో ఒక బంతి కూడా పడలేదు.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.