close
వీళ్లకిదే ఆఖరు!

గేల్‌.. ఆమ్లా.. స్టెయిన్‌.. మలింగ.. ప్రస్తుత క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు వీళ్లు.. ఒక స్థాయిలో వెలిగిన వాళ్లు.. వీళ్ల కెరీర్‌తో పాటు వయసూ పెరిగింది...! ఆటలో కాస్త పదునూ తగ్గింది..  వీళ్లందరూ దాదాపు ఆఖరి ప్రపంచకప్‌ ఆడబోతున్నారు.. అందుకే ఈసారి ప్రపంచకప్‌ అంటే సిక్సులు, ఫోర్లే కాదు.. రికార్డులు, ఘనతలే కాదు.. భావోద్వేగాల కలబోత! మరి ఈ ప్రపంచకప్‌ను ఈ స్టార్‌ ఆటగాళ్లు గొప్పగా ముగిస్తారా!

యూనివర్స్‌ బాస్‌

త ప్రపంచకప్‌లో డబుల్‌ సెంచరీ బాదిసిన ఈ విండీస్‌ వీరుడు.. ఈసారి కప్‌లోనూ కచ్చితంగా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఎందుకంటే ఈ యూనివర్స్‌ బాస్‌కు (అభిమానుల ముద్దు పేరు) చివరి టోర్నీ. టీ20ల్లో అడపాదడపా మెరుస్తున్నా చాలా కాలం నుంచి వన్డేల్లో పెద్దగా ఆడని ఈ స్టార్‌.. ప్రపంచకప్‌లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. అయితే ఫిట్‌నెసే ఈ కరీబియన్‌ స్టార్‌కు పెద్ద అడ్డంకి. విండీస్‌ ఈసారీ కప్‌ గెలవకపోతే ఐదు ప్రపంచకప్‌లు ఆడినా కప్‌ గెలవలేకపోయిన లారా, చందర్‌పాల్‌, జయవర్దనే, కలిస్‌, వెటోరి, అఫ్రిది సరసన చేరతాడు.

వన్డే రికార్డు
మ్యాచ్‌లు : 289 
పరుగులు : 10151
సెంచరీలు : 25 
అర్ధసెంచరీలు: 51

యార్కర్‌ స్టార్‌

పీఎల్‌-12 ఫైనల్‌ చూసినవాళ్లు లసిత్‌ మలింగను మరిచిపోరు. అతనిలో ఇంకా ఈ పవర్‌ ఉందా అనిపించేలా ఐపీఎల్‌లో సత్తా చాటాడీ శ్రీలంక స్టార్‌. ప్రపంచకప్‌ అంటే మలింగ ఇంకా విజృంభిస్తాడు. 2007 ప్రపంచకప్‌లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి పెను సంచలనం సృష్టించాడతను. అయితే గాయాలు కావడం, ఫామ్‌ కోల్పోవడం లాంటి కారణాలతో మలింగ కాస్త వెనకబడ్డాడు. కానీ ప్రపంచకప్‌ ముంగిట మళ్లీ ఫామ్‌ అందుకుని సై అంటున్నాడు. జవసత్వాలు కోల్పోయిన లంకకు మలింగే బౌలింగే ప్రధాన బలం. 35 ఏళ్ల బౌలర్‌పైనే ఆ జట్టు గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి. 

వన్డే రికార్డు
మ్యాచ్‌లు : 218 
వికెట్లు : 322
ఎకానమీ : 5.33 
ఉత్తమం : 6/38

మిస్టర్‌ డిపెండబుల్‌

27.. హషీమ్‌ ఆమ్లా వన్డేల్లో చేసిన సెంచరీలు.. ఏ దక్షిణాఫ్రికా ఆటగాడూ ఇన్ని శతకాలు చేయలేదు.. అరుదుగా విఫలమయ్యే వాడు... బౌలర్లకు కొరకరాని కొయ్యగా ఉండేవాడు.. కానీ 2018 నుంచి అతని ప్రభ తగ్గింది. బ్యాటింగ్‌లో పదును లోపించింది. జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఇలాంటి క్లిష్ట స్థితిలో తన ఆఖరి ప్రపంచకప్‌ ఆడేందుకు వస్తున్నాడు 36 ఏళ్ల స్టార్‌ ఆటగాడు. 2011, 2015 ప్రపంచకప్‌లలో ఆడినా జట్టును ఫైనల్‌కు చేర్చలేకపోయాడు. ఈసారైనా సఫారీ జట్టుకు   కప్పు ముచ్చట తీరుస్తాడేమో చూడాలి

వన్డే రికార్డు
మ్యాచ్‌లు : 174 
పరుగులు : 7910
సెంచరీలు : 27 
అర్ధసెంచరీలు: 37

కివీ వెన్నెముక

సారి ఆఖరి ప్రపంచకప్‌ ఆడే ఆటగాళ్లలో న్యూజిలాండ్‌ వెటరన్‌ రాస్‌ టేలర్‌ కూడా ఉన్నాడు. 2006లో వన్డే అరంగేట్రం చేసిన టేలర్‌.. ఇప్పటిదాకా మూడు ప్రపంచకప్‌లలో పాల్గొన్నాడు. కివీస్‌ జట్టు మిడిలార్డర్‌కు వెన్నెముకగా ఉన్న 35 ఏళ్ల రాస్‌కు ఇదే ఆఖరి ప్రపంచకప్‌ కావొచ్చు. 2016లో కంటి శస్త్ర చికిత్స తర్వాత టెక్నిక్‌లో మార్పులు చేసుకున్న టేలర్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కివీస్‌కు ఈసారైనా కప్‌ అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. అతడి ఫామ్‌ కివీస్‌కు బలాన్ని మరింత పెంచుతోంది. 

వన్డే రికార్డు
మ్యాచ్‌లు : 218 
పరుగులు : 8026
సెంచరీలు : 20 
అర్ధసెంచరీలు: 47

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.