Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 121938
            [news_title_telugu_html] => 

అదిరేటి ఫినిషింగ్‌ నువ్విస్తే..

[news_title_telugu] => అదిరేటి ఫినిషింగ్‌ నువ్విస్తే.. [news_title_english] => [news_short_description] => 2019 జులై 14.. చారిత్రక లార్డ్స్‌ మైదానంలో ప్రపంచకప్‌ ఫైనల్‌ ముగిసింది.. భారత క్రికెట్‌ జట్టు విజేతగా నిలిచింది.. కోహ్లి కప్పు అందుకున్నాడు.. తర్వాత ధోని చేతికిచ్చాడు.. అతను ముద్దాడాడు.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
అదిరేటి ఫినిషింగ్‌ నువ్విస్తే.. - EENADU
close
అదిరేటి ఫినిషింగ్‌ నువ్విస్తే..

2019 జులై 14.. చారిత్రక లార్డ్స్‌ మైదానంలో ప్రపంచకప్‌ ఫైనల్‌ ముగిసింది.. భారత క్రికెట్‌ జట్టు విజేతగా నిలిచింది.. కోహ్లి కప్పు అందుకున్నాడు.. తర్వాత ధోని చేతికిచ్చాడు.. అతను ముద్దాడాడు.. జట్టు సభ్యులు ధోనీని భుజాలకెత్తుకుని మైదానంలో ఊరేగించారు.. ఆ సంబరమంతా ముగిశాక తన్నుకొస్తున్న భావోద్వేగాల్ని ఆపుకొంటూ తాను రిటైరవుతున్నట్లు ధోని ప్రకటన చేశాడు.. తన చిట్టచివరి మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు కప్పు అందించి ఘనంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహిని క్రికెట్‌ ప్రపంచమంతా కొనియాడింది.

ఒక్కసారి ఈ దృశ్యాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి. మహేంద్రుడి మహాప్రస్థానానికి ఇంతకంటే మంచి ముగింపు మరొకటుంటుందా? ప్రతి ధోని అభిమాని ఆశ ఇదే ఇప్పుడు. ధోని కెరీర్‌ చరమాంకానికి వచ్చేసిందని అందరికీ తెలుసు. బహుశా ప్రపంచకప్‌తోనే అతడి కెరీర్‌ ముగియవచ్చు. మరి పై ఊహ లాగే అతడి ముగింపు అద్భుతంగా ఉంటుందా? 

ఆటగాడిగా మొదలై.. ఆటగాడిగానే!

వన్డేల్లో ధోనికిది నాలుగో ప్రపంచకప్‌. 2007లో  తొలిసారి ఈ మెగా టోర్నీలో ఆడాడు. అప్పుడు అతను  ఆటగాడే. 2011లో కెప్టెన్‌గా టోర్నీలో అడుగుపెట్టి జట్టుకు ట్రోఫీ అందించాడు. 2015లో కెప్టెన్‌గా చివరి ప్రపంచకప్‌ ఆడాడు. ఇప్పుడు కోహ్లి నాయకత్వంలో ఆటగాడిగా బరిలోకి  దిగుతున్నాడు.

341

ఇప్పటివరకు ధోని ఆడిన వన్డేలు. 50.72 సగటుతో 10500 పరుగులు చేశాడు. అందులో 10 శతకాలు, 71 అర్ధశతకాలు ఉన్నాయి.

665

ఇంగ్లాండ్‌లో ఆడిన 29 వన్డేల్లో ధోని చేసిన పరుగులు. 78* అత్యధిక స్కోరు. 6 అర్ధసెంచరీలు చేశాడు.

ఈనాడు క్రీడావిభాగం

టగాడిగా, కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోని ఘనతల గురించి, భారత క్రికెట్‌ జట్టుకు అతను అందించిన సేవల గురించి కొత్తగా చెప్పాలా? 15-20 ఏళ్లు క్రికెట్లో కొనసాగిన వాళ్లు సాధించిన దాని కంటే ఇంకా ఎక్కువగా తన కెరీర్‌ మొదలైన ఆరేడేళ్లలోనే సాధించేశాడు ధోని. ఆటగాడిగా, వికెట్‌ కీపర్‌గా అతను భారత్‌కు అందించిన విజయాలకు లెక్కే లేదు. ఇక కెప్టెన్‌గా అతడి ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతర్జాతీయ కెరీర్‌ ఆరంభమైన మూడేళ్లలోనే దేశానికి టీ20 ప్రపంచకప్‌ అందించాడు. ఇంకో నాలుగేళ్లకే వన్డే ప్రపంచకప్పూ సాధించిపెట్టాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా అతను కొత్తగా సాధించాల్సిందేమీ లేదు. తనేంటో రుజువు చేసుకోవాల్సిందేమీ లేదు. 38వ పడికి చేరువ అవుతూ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నాడంటే అది జట్టు అవసరాల కోసమే.

ఎన్ని విమర్శలు వచ్చినా..

త కొన్నేళ్లలో ధోని బ్యాటింగ్‌ జోరు తగ్గిన నేపథ్యంలో అతనూ ఎన్నడూ లేని విధంగా విమర్శలూ ఎదుర్కొన్నాడు. ధోని మనస్తత్వం ప్రకారం అయితే తన సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తడానికి ముందే అతను తప్పుకుని ఉండాలి. కానీ 2019 ప్రపంచకప్‌లో అతను ఎంతో కీలక పాత్ర పోషించాల్సి ఉంది కాబట్టే అతనూ జట్టును వదలట్లేదు. జట్టూ అతడిని విడిచిపెట్టట్లేదు. ధోని రిటైర్మెంట్‌ చర్చ రెండు మూడేళ్ల ముందే మొదలైంది. అప్పట్నుంచే ప్రత్యామ్నాయాలపై జట్టు యాజమాన్యం దృష్టిపెట్టింది. ఎంతోమంది ఆటగాళ్లను ప్రయత్నించింది. కానీ ఇప్పటికీ ధోని స్థానాన్ని భర్తీ చేసే మరో ఆటగాడు కనిపించడం లేదు. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ధోని వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్న పంత్‌ సైతం అతడంత బాధ్యతతో ఆడగలడా.. ఒత్తిడిని తట్టుకుని ఫినిషర్‌ పాత్ర పోషించగలడా.. అతడిలా వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యం చూపించగలడా అంటే, అప్పుడే ఔననలేం. ఇక వ్యూహకర్తగా ధోని స్థానం ఇక ఎప్పటికీ భర్తీ కాదేమో. అందుకే జట్టు ఇప్పటికీ ధోనిపై ఎంతో ఆధారపడుతోంది. ఈ ప్రపంచకప్‌లో తన అవసరం ఉంది కాబట్టే.. తన ఆట విషయంలో విమర్శలొచ్చినా మహి రిటైరవకుండా జట్టుతో సాగుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ధోని స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి జట్టుకు కప్పు అందిస్తే.. అతడి ఉజ్వల కెరీర్‌కు అంతకంటే గొప్ప ముగింపు మరొకటి ఉండదు.

బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌ కన్నా..

ప్రపంచకప్‌లో బ్యాట్స్‌మన్‌గా అతడి పాత్ర ఎంతో కీలకం. భారత మిడిలార్డర్‌ ఏమంత బలంగా లేని నేపథ్యంలో ఆశలన్నీ మహిపైనే. హార్దిక్‌ పాండ్య, జాదవ్‌ లాంటి ఆటగాళ్లతో సమన్వయం చేసుకుని మ్యాచ్‌ల్లో మిడిల్‌ భారాన్ని మోయాల్సిన బాధ్యత అతడిదే. ఇక వికెట్‌ కీపింగ్‌లో ధోని ఎంత కీలకమో చెప్పాల్సిన పని లేదు. ఈ వయసులోనూ వికెట్ల వెనుక అతను చూపిస్తున్న చురుకుదనం అసామాన్యం. ఇక బ్యాటింగ్‌, వికెట్‌కీపింగ్‌ కంటే ఒక వ్యూహకర్తగా ఈ ప్రపంచకప్‌లో మహి పోషించాల్సిన పాత్ర అత్యంత ప్రధానమైంది. రెండేళ్ల కిందట వన్డే కెప్టెన్సీని కోహ్లికి అప్పగించినా.. మైదానంలో మాత్రం ధోని కెప్టెన్‌ లాగే వ్యవహరిస్తున్నాడు. బౌలింగ్‌ మార్పుల్లో, బౌలర్లకు సూచనలివ్వడంలో, ఫీల్డింగ్‌ ఏర్పాట్లలో అతడి పాత్ర కీలకం. ఈ విషయంలో కోహ్లితో అతడికి చక్కటి సమన్వయం ఉంది. రెండు నెలల కిందట ఆస్ట్రేలియా సిరీస్‌లో ధోని లేని రెండు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా కోహ్లి బలహీనంగా కనిపించాడు. ధోనీపై అతనెంత ఆధారపడుతున్నాడో అప్పుడే స్పష్టమైంది. ప్రపంచకప్‌లో ధోని అండ విరాట్‌కు మరింత అవసరం. మొత్తంగా చూస్తే ప్రపంచకప్‌లో ధోని పోషించాల్సింది బహుముఖ పాత్ర.

ఉత్తమ ఫినిషరేనా?

త రెండు మూడేళ్లలో ధోని బ్యాటింగ్‌ జోరు తగ్గిన మాట వాస్తవం. ఒకప్పుడు మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుండగా ధోని క్రీజులో ఉంటే.. బౌలర్లు బెంబేలెత్తిపోయేవాళ్లు. 5 బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉన్నా ధోని ప్రశాంతంగా ఉండేవాడు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారుతూ వస్తోంది. బౌలర్లే ధోనీని ఒత్తిడిలోకి నెడుతున్నారు. ఉన్న బంతులు, చేయాల్సిన పరుగులు సమానంగా ఉన్నా కూడా ధోని ఇబ్బంది పడటం చాలా మ్యాచ్‌ల్లో చూశాం. అతను ఇంతకుముందులా బంతిని బాదలేకపోతున్నాడు. టైమింగ్‌ సరిగా కుదరట్లేదు. క్రీజులో కుదురుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. బంతులెక్కువ వృథా చేస్తున్నాడు. బౌలింగ్‌కు పిచ్‌ పూర్తి అనుకూలంగా ఉన్నపుడు, అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్లు ఎదురైనపుడు ఇబ్బంది పడుతున్నాడు. కానీ ధోని పనైపోయిందని ఎప్పుడూ అనుకోవడానికి మాత్రం వీల్లేదు. అతనో పోరాట యోధుడు. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడని విమర్శలు రాగానే.. చక్కటి ఓ ఇన్నింగ్స్‌తో తన విలువను తెలియజేయడం, విమర్శకుల నోళ్లు మూయించడం ధోనికి అలవాటే. ఈ ఏడాది ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో తడబడగానే ధోనీని విమర్శించారు. కానీ ఆ తర్వాత అతను విధ్వంసక బ్యాటింగ్‌తో ఆశ్చర్యపరిచాడు. ఈ మధ్య కాలంలో మహి ఆ స్థాయిలో చెలరేగిపోవడం చూడలేదు. చివరి ఓవర్లలో ఒత్తిడిని చిత్తు చేస్తూ భారీ షాట్లు ఆడి.. బౌలర్లను బెంబేలెత్తించడం అభిమానులకు మహదానందాన్నిచ్చింది. ముఖ్యంగా బెంగళూరుతో మ్యాచ్‌ చివరి ఓవర్లో ఉమేశ్‌ యాదవ్‌ను ఉతికారేస్తూ సిక్సర్ల మోత మోగించడం మరిచిపోలేనిదే. ‘ఫినిషింగ్‌’లో ధోని పూర్వ వైభవాన్ని ఈ ఐపీఎల్‌ గుర్తు చేసింది. ఇదే జోరును ప్రపంచకప్‌లోనూ మహి కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఐతే అంతర్జాతీయ క్రికెట్లో, ముఖ్యంగా ప్రపంచకప్‌లో పరిస్థితులు, బౌలింగ్‌ నాణ్యత, ఒత్తిడి వేరు. ఇక్కడ రాణించడం ధోనీకి సవాలే. ఈ సవాలును ఛేదించి ప్రపంచకప్‌పై తనదైన ముద్ర వేసి.. మ్యాచ్‌లను ముగించడంలోనే కాదు, కెరీర్‌ను ముగించడంలోనూ తనకు తానే సాటి అని ధోని అనిపిస్తాడేమో చూడాలి.

కప్పు తెచ్చేది బౌలర్లే..

దిల్లీ: భారత్‌కు సమతూకంతో కూడిన బౌలింగ్‌ దళం ఉందని, ప్రపంచకప్‌లో టైటిల్‌కు గట్టి పోటీదారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అన్నాడు. వికెట్ల పడగొట్టడమే ప్రపంచకప్‌ విజేత నిర్ణయించబోతోందని చెప్పాడు. ‘‘ఇప్పడంతా బ్యాట్స్‌మెన్‌ హవానే. వన్డేల్లో పరుగుల వరద పారుతోంది. అయినప్పటికీ కొన్ని మంచి బౌలింగ్‌ దళాలు 2019 ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్నాయి. వికెట్లు తీయడమే ప్రపంచకప్‌ విజేతను నిర్ణయించబోతోంది. భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలకు సమతూకంతో కూడిన బౌలింగ్‌ ఉంది. భారత్‌కు వైవిధ్యమైన బౌలింగ్‌ ఉంది. అనుకూలమైన పరిస్థితులు ఉంటే బుమ్రా, షమి, భువనేశ్వర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తారు. పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. పిచ్‌లు పొడిగా మారితే స్పిన్నర్లు కుల్‌దీప్‌, చాహల్‌ల ద్వయాన్ని ఎదుర్కోవడం బ్యాట్స్‌మెన్‌కు కష్టమే’’ అని చాపెల్‌ అన్నాడు. హార్దిక్‌ పాండ్య ఉపయుక్తమైన ఫాస్ట్‌బౌలింగ్‌ ఆల్‌రౌండరని చెప్పాడు.

సన్నాహక మ్యాచ్‌లో ఓటమితో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మ్యాచ్‌ మ్యాచ్‌కూ జట్టుపై నా అభిప్రాయం మారదు. టోర్నమెంట్లో ఇలాంటివి జరుగుతుంటాయి. అసలు టోర్నీ ఇంకా ఆరంభమే కాలేదు. భారత జట్టు నిలదొక్కుకోవడం అవసరం. ఒకట్రెండు మ్యాచ్‌ల్లో ఇబ్బందులు సహజం. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను భారత్‌ సద్వినియోగం చేసుకోవాలి. పిచ్‌లపై అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు.

- సచిన్‌ తెందుల్కర్‌

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను జనం చాలా తీవ్రంగా తీసుకుంటారు. ప్రపంచకప్‌లో భారత జట్టు ఒక్కదానిపై గెలిచినా చాలానే వాళ్లూ మా దేశంలో ఉన్నారు. ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పరాజయపరంపరకు మేం ఈసారి తెరదించుతామనే ఆశాభావంతో ఉన్నా.

- ఇంజమాముల్‌ హక్‌, పాకిస్థాన్‌ చీఫ్‌ సెలక్టర్‌

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.