close
దక్షిణాఫ్రికా.. ఎట్టకేలకు!

కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు అఫ్గానిస్థాన్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట ఇమ్రాన్‌ తాహిర్‌ (4/29), మోరిస్‌ (3/13), ఫెలుక్వాయో (2/18)ల ధాటికి అఫ్గాన్‌ 34.1 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. తొమ్మిదో స్థానంలో ఆడిన రషీద్‌ ఖాన్‌ (35) ఆ జట్టులో టాప్‌స్కోరర్‌ కావడం గమనార్హం. అతను కాకుండా హజ్రతుల్లా (22), నూర్‌ అలీ (32) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. అనంతరం ఓపెనర్లు డికాక్‌ (68; 72 బంతుల్లో 8×4), ఆమ్లా (41 నాటౌట్‌; 83 బంతుల్లో 4×4) సత్తా చాటడంతో దక్షిణాఫ్రికా 28.4 ఓవర్లలో ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్నందుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా పరాజయం పాలవగా.. వెస్టిండీస్‌తో ఆ జట్టు మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే.

అఫ్గానిస్థాన్‌: 125 (హజ్రతుల్లా 22, నూర్‌ అలీ 32, రషీద్‌ ఖాన్‌ 35; తాహిర్‌ 4/29, మోరిస్‌ 3/13, ఫెలుక్వాయో 2/18)

దక్షిణాఫ్రికా: 131/1 (డికాక్‌ 68; ఆమ్లా 41 నాటౌట్‌; ఫెలుక్వాయో 17 నాటౌట్‌)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.