close
విజృంభించిన భరత్‌ 

విజయం దిశగా బాలాజీ కోల్ట్స్‌ 
ఎ- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎ- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో బాలాజీ కోల్ట్స్‌ తొలి విజయం సాధించే దిశగా సాగుతోంది. ఆ జట్టు బౌలర్‌ భరత్‌ (5/75) ఐదు వికెట్లతో చెలరేగడంతో నల్గొండ జిల్లా జట్టుతో సోమవారం ఆరంభమైన మ్యాచ్‌లో బాలాజీ కోల్ట్స్‌ పైచేయి సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన నల్గొండ జట్టు.. భరత్‌ ధాటికి 68.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. భరత్‌ తన పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్లను హడలెత్తించాడు. ఆ జట్టులో షేన్‌ మజీద్‌ (61), ఎండీ షరీఫ్‌ (73), బషీర్‌ అహ్మద్‌ (32) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన బాలాజీ కోల్ట్స్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 21 ఓవర్లలో 108/1తో నిలిచింది. సాయి తేజ (44 బ్యాటింగ్‌), ప్రణవ్‌ (50 బ్యాటింగ్‌) జట్టును విజయం దిశగా నడిపిస్తున్నారు.

సత్తాచాటిన సక్లెయిన్‌: గౌడ్స్‌ ఎలెవన్‌ జట్టు బౌలర్‌ ఎండీ సక్లెయిన్‌ (4/100) నాలుగు వికెట్లతో చెలరేగాడు. శ్రీచక్ర జట్టుతో ఆరంభమైన ఎ- డివిజన్‌ రెండు రోజుల క్రికెట్‌ మ్యాచ్‌లో గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన శ్రీ చక్ర జట్టు 77.3 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. గొప్పగా పోరాడిన వికాస్‌ (98) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. సోమశేఖర్‌ (48), తమీమ్‌ (34) రాణించారు. సక్లెయిన్‌తో పాటు వంశీకృష్ణ (4/41) మెరిసి ప్రత్యర్థిని కట్టడి చేశారు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన గౌడ్స్‌ ఎలెవన్‌ జట్టు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 17 పరుగులు చేసింది.

అదరగొట్టిన వివేక్‌: ఎంసీసీ ఆటగాడు వివేక్‌ సింగ్‌ (183; 263 బంతుల్లో 32×4, 1×6) భారీ శతకంతో చెలరేగాడు. అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. చూడముచ్చటైన షాట్లతో సెంచరీ నమోదు చేశాడు. వివేక్‌ శతకం సాయంతో.. డబ్ల్యూఎంసీసీతో ఆరంభమైన మ్యాచ్‌లో ఎంసీసీ ఆధిపత్యం చలాయిస్తోంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఎంసీసీ 90 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. ఎంసీసీ ఇన్నింగ్స్‌లో వివేక్‌ బ్యాటింగే హైలైట్‌. జట్టు బ్యాటింగ్‌ భారాన్ని మోసిన అతను భారీ సెంచరీ సాధించాడు. ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచి జట్టు మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ పరుగులు రాబట్టాడు. వివేక్‌తో పాటు భానుప్రకాశ్‌ (42), ప్రమోద్‌ మహాజన్‌ (34) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రఫుల్‌ (6/138) ఆరు వికెట్లతో విజృంభించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డబ్ల్యూఎంసీసీ ఆట ముగిసే సరికి 3 ఓవర్లలో 12/1తో నిలిచింది.

డెక్కన్‌ బ్లూస్‌, ఫ్యూచర్‌ స్టార్‌ విజయాలు: ఎ- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌లో డెక్కన్‌ బ్లూస్‌, ఫ్యూచర్‌ స్టార్‌, రోహిత్‌ ఎలెవన్‌ జట్లు శుభారంభం చేశాయి. రాజు సీసీతో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్‌ బ్లూస్‌ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన డెక్కన్‌ బ్లూస్‌ 36.3 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ముకేశ్‌ (38 నాటౌట్‌) రాణించాడు. ఛేదనలో రాజు సీసీ 28.1 ఓవర్లలో 54 పరుగులకే కుప్పకూలింది. వశిష్ఠ్‌ (3/9), శ్రీకాంత్‌ (3/19) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. మరో మ్యాచ్‌లో ఫ్యూచర్‌ స్టార్‌ 4 పరుగుల తేడాతో ఖమ్మం జిల్లా జట్టుపై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఫ్యూచర్‌ స్టార్‌ 41.3 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌటైంది. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఖమ్మం జట్టు 103 పరుగులకే చేతులెత్తేసింది. సిద్ధార్థ్‌ (5/17) ఐదు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. ఇంకో మ్యాచ్‌లో రోహిత్‌ ఎలెవన్‌ 8 వికెట్ల తేడాతో న్యూబ్లూస్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూబ్లూస్‌ 41.2 ఓవర్లలో 105 పరుగులకే వికెట్లన్నీ కోల్పోయింది. మారుతి (51) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనలో రోహిత్‌ ఎలెవన్‌ 2 వికెట్లు కోల్పోయి 29.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. షాబాజ్‌ ఖాన్‌ (58) జట్టుకు విజయాన్ని అందించాడు.

ఎ- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌: న్యూబ్లూస్‌: 105 (మారుతి 51, మధుగౌడ్‌ 3/35, విశాల్‌ 3/17), రోహిత్‌ ఎలెవన్‌: 106/2 (షాబాజ్‌ ఖాన్‌ 58); నల్గొండ జిల్లా: 312 (షేక్‌ మజీద్‌ 61, షరీష్‌ 73, బషీర్‌ అహ్మద్‌ 32, భరత్‌ 5/75), బాలాజీ కోల్ట్స్‌: 108/1 (సాయి తేజ 44 బ్యాటింగ్‌, ప్రణవ్‌ 50 బ్యాటింగ్‌); శ్రీచక్ర: 268 (వికాస్‌ 98, సోమశేఖర్‌ 48, తమీమ్‌ 34, ఎండీ సక్లెయిన్‌  4/100, వంశీకృష్ణ 4/41), గౌడ్స్‌ ఎలెవన్‌: 17/1; విశాఖ: 142 (జగదీశ్‌ 63, చంద్రకాంత్‌ 3/16), పోస్టల్‌:  51/0;  సాయి సత్య: 282 (శ్యామ్‌ శర్మ 61, సాయికృష్ణ రెడ్డి 43, విశాల్‌ యాదవ్‌ 34, విజయ్‌ ఆకాశ్‌ 37), అపెక్స్‌ సీసీ: 31/0; పాషా బీడీ: 209 (రెహ్మాన్‌ 39, టౌకీర్‌ 30, జగదీప్‌ 33, యువరాజు 6/50),జై  భగవతి; బడ్డింగ్‌ స్టార్‌: 162 (ప్రణయ్‌ 73, సతీశ్‌ 3/12), మెదక్‌ జిల్లా: 81/4; డెక్కన్‌ బ్లూస్‌: 97 (ముకేశ్‌ 38 నాటౌట్‌, మన్నాస్‌ 3/17), రాజు సీసీ: 54 (వశిష్ఠ్‌ 3/9, శ్రీకాంత్‌ 3/19); ఎంసీసీ: 300/8 (భాను ప్రకాశ్‌ 42, వివేక్‌ సింగ్‌ 183, ప్రమోద్‌ 34, ప్రఫుల్‌ 6/138), డబ్ల్యూఎంసీసీ: 12/1; యూచర్‌ స్టార్‌: 107 (సిద్ధార్థ్‌ 37, అజార్‌ 3/16), ఖమ్మం: 103 (సునీల్‌ 32, సిద్ధార్థ్‌ 5/17, వైష్ణవ్‌రెడ్డి 3/13).

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.