close
కశ్యప్‌కు లక్ష్యసేన్‌ షాక్‌

ఫుల్లర్‌టాన్‌ (యుఎస్‌ఏ): ఇటీవల కెనడా ఓపెన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచి జోరు మీదున్న భారత షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌కు అనూహ్య పరాజయం. యుఎస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో కశ్యప్‌కు భారత్‌కే చెందిన యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ షాకిచ్చాడు. పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్లో కశ్యప్‌ 11-21, 18-21 తేడాతో లక్ష్యసేన్‌ చేతిలో ఓడాడు. అనుభవజ్ఞుడైన కశ్యప్‌.. యువ ఆటగాడు సేన్‌ ధాటికి నిలవలేకపోయాడు. వరుస సెట్లలో చిత్తయ్యాడు. మరోవైపు ప్రణయ్‌, సౌరభ్‌ శుభారంభం చేశారు. ప్రణయ్‌ 21-23, 24-22, 21-18తో యూ ఇగరాశి (జపాన్‌)పై పోరాడి గెలిచాడు. మరో మ్యాచ్‌లో సౌరభ్‌ 21-23, 21-15, 22-20తో టాబీ పెంటీ (ఇంగ్లాండ్‌)పై అతికష్టంగా విజయం సాధించాడు. అజయ్‌ జయరాం 16-21, 21-18, 16-21తో వాంగ్‌ జూ వీ (తైపీ) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మహిళల సింగిల్స్‌లో శ్రీ కృష్ణప్రియ, అరుణ పోరాటం ముగిసింది. తొలిరౌండ్లో కృష్ణప్రియ 11-21, 8-21తో కిమ్‌ (కొరియా) చేతిలో, అరుణ 17-21, 14-21తో లిన్‌ సియాంగ్‌ (తైపీ) చేతిలో ఓడారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తరుణ్‌- సంకీర్త్‌ జోడీ 11-21, 11-21తో లీ యాంగ్‌- సియాంగ్‌ (కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.