close
సెరెనా పదకొండోసారి

వింబుల్డన్‌ ఫైనల్లో ప్రవేశం
తుది పోరులో హలెప్‌తో ఢీ

వింబుల్డన్‌: మార్గరేట్‌ కోర్ట్‌ (24 టైటిళ్లు) అత్యధిక టైటిళ్ల రికార్డును సమం చేయాలని ఉవ్విళ్లూరుతున్న అమెరికా తార సెరెనా విలియమ్స్‌ ఆ కల తీర్చుకునేందుకు ఒక అడుగు దూరంలో నిలిచింది. ఆమె రికార్డు స్థాయిలో పదకొండోసారి వింబుల్డన్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌ సమరంలో పదకొండో సీడ్‌ సెరెనా 6-1, 6-2తో స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) పోరాటానికి తెరదించింది.  ఈ మ్యాచ్‌లో సెరెనా మూడు ఏస్‌లతో పాటు 16 విన్నర్లు కొట్టింది. మరో సెమీస్‌లో ఏడో సీడ్‌ హలెప్‌ 6-1, 6-3తో ఎనిమిదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌)ను చిత్తు చేసింది. ఐదుసార్లు స్వితోలినా సర్వీస్‌ బ్రేక్‌ చేసిన హలెప్‌.. ఏ దశలోనూ ఆమెను పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఆమె 26 విన్నర్లతో పాటు ఒక ఏస్‌ కొట్టింది. శనివారం ఫైనల్లో సెరెనాను హలెప్‌ ఢీకొంటుంది.

పురుషుల సెమీస్‌ నేడే
జకోవిచ్‌ (సెర్బియా) × బటిస్టా (స్పెయిన్‌)
ఫెదరర్‌ (స్విట్జర్లాండ్‌) × నాదల్‌ (స్పెయిన్‌)
సా।। 5.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.