close
గణేశ్‌ ట్రిపుల్‌ సెంచరీ 

మహబూబ్‌నగర్‌ 622/5 
ఎ- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎ- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం నమోదైంది. మహబూబ్‌నగర్‌ ఆటగాడు గణేశ్‌ (318 నాటౌట్‌; 200 బంతుల్లో 42×4, 7×6) అజేయ త్రిశతకంతో చెలరేగాడు. అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రదర్శనతో అలరించాడు. సునాయాసంగా ట్రిపుల్‌ సెంచరీ బాదేసి రికార్డులు సృష్టించాడు. గణేశ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ సాయంతో రాజు సీసీతో సోమవారం ఆరంభమైన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 90 ఓవర్లలో 5 వికెట్లకు 622 పరుగులు అత్యధిక స్కోరు సాధించింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో గణేశ్‌ ఇన్నింగ్సే హైలైట్‌. ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోసిన అతను ఎడాపెడా బౌండరీలు బాదాడు. బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగుల ప్రవహాన్ని కొనసాగించాడు. చూడముచ్చటైన షాట్లతో అలరిస్తూ ట్రిపుల్‌ సెంచరీ సాధించేశాడు. చివరి వరకూ అజేయంగా నిలిచి జట్టుకు భారీస్కోరు అందించాడు. మరోవైపు మహేశ్‌ బాబు (106; 78 బంతుల్లో 9×4, 5×6) శతకంతో గణేశ్‌కు చక్కటి సహకారం అందించాడు. వీళ్లిద్దరూ కలిసి ప్రత్యర్థి బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. 

మెరిసిన రాజీవ్‌: తెలంగాణ సీసీ బౌలర్‌ అశ్వద్‌ రాజీవ్‌ (5/51) తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఫ్యూచర్‌ స్టార్‌తో ఆరంభమైన మ్యాచ్‌లో అతను మరోసారి ఐదు వికెట్లతో చెలరేగాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఫ్యూచర్‌ స్టార్‌.. రాజీవ్‌ ధాటికి 50.4 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఆరంభం నుంచే విజృంభించిన రాజీవ్‌ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. పదునైన బంతులతో హడలెత్తించాడు. యశ్‌ మిశ్రా (39), వైష్ణవ్‌ రెడ్డి (42) రాణించకపోయి ఉంటే ఆ జట్టు పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. మరీ స్వల్ప స్కోరుకే ఆ జట్టు కుప్పకూలేది. 
సత్తాచాటిన సందేశ్‌: సాయి సత్య బౌలర్‌ సందేశ్‌ (5/44) ఐదు వికెట్లతో విజృంభించి తన జట్టుకు విజయాన్ని అందించాడు. అతని జోరుతో గౌడ్స్‌ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయి సత్య నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన గౌడ్స్‌ ఎలెవన్‌ జట్టును తన పదునైన పేస్‌తో సందేశ్‌ వణికించాడు. దాంతో ఆ జట్టు 40.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌ శశాంక్‌ (43) వికెట్‌తో మొదలెట్టిన సందేశ్‌ ఆ తర్వాత మరో నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. సందేశ్‌తో పాటు అభిషేక్‌ రెడ్డి (2/44), రోహిత్‌ (2/21) కూడా రాణించారు. అనంతరం ఛేదనలో సాయి సత్య 32.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సాయి కృష్ణ (69) అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి బౌలర్లలో సక్లెయిన్‌ (3/50) మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో సాయి సత్య ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయి. 
ఎ- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌: గౌడ్స్‌ ఎలెవన్‌: 146 (శశాంక్‌ 43, అజ్మత్‌ఖాన్‌ 31, సందేశ్‌ 5/41), సాయి సత్య: 149/6 (సాయి కృష్ణ 69, ఎండీ సక్లెయిన్‌ 3/50);  శ్రీ చక్ర: 159 (వికాస్‌ రావు 58, సాయి సంపత్‌ 31, షాజైబ్‌ ఖాన్‌ 4/49, ఫర్హామ్‌ అబూజర్‌ 4/49), బడ్డింగ్‌ స్టార్‌: 47/0; విజయ్‌ హనుమాన్‌: 141 (సాహిల్‌ 35, నదీమ్‌ 4/39, ప్రశాంత్‌ రాజ్‌ 5/44), రోహిత్‌ ఎలెవన్‌: 29/2;  పోస్టల్‌: 120/4 (అహ్మద్‌ షకీర్‌ 67 బ్యాటింగ్‌), మెదక్‌;  పాషా బీడీ: 179 (రాజ్‌గౌడ్‌ 31, స్వచిత్‌ కుమార్‌ 46, ప్రణీత్‌ గౌడ్‌ 3/18, అద్వైత్‌ రెడ్డి 5/80), విశాఖ: 60/2 (విఘ్నేశ్‌ 32 బ్యాటింగ్‌); బాలాజీ కోల్ట్స్‌: 107 (ప్రమోద్‌ 4/14, రాహుల్‌ రెడ్డి 3/34), అపెక్స్‌: 108/5 (ప్రజ్వల్‌ 36, త్రినేశ్‌ 32); బీ బాలాజీ సీసీ: 283 (శశాంక్‌ 56, శ్రావణ్‌ కుమార్‌ 84, అనిల్‌ కుమార్‌ 32, రోమిత్‌ రెడ్డి 39, తేజోదర్‌ 4/77, చైతన్య 3/42), టీమ్‌ స్పీడ్‌: 44/4;  హెచ్‌యూసీసీ: 130 (సాయి కిరణ్‌ 44 నాటౌట్‌, అతుల్‌ వ్యాస్‌ 38, హరికృష్ణ 3/21, పంకజ్‌ 3/24), చీర్‌ఫుల్‌ ఛమ్స్‌: 103 (రాహుల్‌ 29, అతుల్‌ వ్యాస్‌ 3/17, సాయి కిరణ్‌ 3/18); బీ రాకేశ్‌ ఎలెవన్‌: 137 (ధీరజ్‌ విశాల్‌ 82, సాయి వరుణ్‌ 3/28, నిఖిల్‌ 3/46), కాంకర్డ్‌;  నేషనల్‌ సీసీ: 230 (అమీన్‌ లలాని 87, సహేంద్ర 49, సుజీత్‌ 33, షేక్‌ అజార్‌ 4/26), ఖమ్మం: 112/6 (సునీల్‌ అరవింద్‌ 60, సహేంద్ర 4/56);  బ్రదర్స్‌ ఎలెవన్‌: 290 (హర్షవర్ధన్‌ సింగ్‌ 111, నితీశ్‌ 35, వరుణ్‌ వినోద్‌ 50, శివశంకర్‌ 3/51), పీకేఎంసీసీ;  హైదరాబాద్‌ టైటాన్స్‌: 378/5 (జైనాథ్‌ మాన్‌సింగ్‌ 77, వేణు 126), క్లాసిక్‌ సీసీ: 36/1; మహబూబ్‌నగర్‌: 622/5 (శ్రీకాంత్‌ 46, గణేశ్‌ 318 నాటౌట్‌, ఖయ్యూమ్‌ 61, మహేశ్‌ బాబు 106, సునీల్‌ రెడ్డి 30 నాటౌట్‌), రాజు సీసీ;  ఫ్యూచర్‌ స్టార్‌: 162/9 (యశ్‌ మిశ్రా 39, వైష్ణవ్‌రెడ్డి 42, అశ్వద్‌ రాజీవ్‌ 5/51), తెలంగాణ సీసీ; ఉస్మానియా: 167/7 (విశాల్‌ సింగ్‌ 55, దెబాన్షు 48 నాటౌట్‌), డెక్కన్‌ బ్లూస్‌.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.