close
మెరిసిన భగత్‌ 

ఆర్‌.దయానంద్‌ 284/7 
ఎ-డివిజన్‌ మూడు రోజుల లీగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆల్‌రౌండర్‌ భగత్‌వర్మ (159; 208 బంతుల్లో 17×4, 5×6) మెరిశాడు. సిక్సర్లు, బౌండరీలతో చెలరేగి భారీ శతకం సాధించాడు. దీంతో ఎస్‌బీఐతో జరుగుతున్న ఎ-డివిజన్‌ మూడు రోజుల లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో ఆర్‌.దయానంద్‌ గౌరవప్రదమైన స్కోరు దిశగా పయనిస్తోంది. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌.దయానంద్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు సాధించింది. భగత్‌వర్మ సెంచరీతో సత్తాచాటాడు. ఎస్‌బీఐ బౌలర్‌ ఆకాశ్‌ భండారి (5/94) ఐదు వికెట్లు తీశాడు 
వైష్ణవ్‌, మిఖిల్‌ శతకాలు: వైష్ణవ్‌రెడ్డి (113; 118 బంతుల్లో 16×4, 2×6), మిఖిల్‌ జైశ్వాల్‌ (142 బ్యాటింగ్‌; 191 బంతుల్లో 17×4, 2×6) శతకాలతో చెలరేగడంతో కాంటినెంటల్‌తో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో ఎంపీ కోల్ట్స్‌ భారీస్కోరు దిశగా దూసుకెళ్తోంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఎంపీ కోల్ట్స్‌ తొలి రోజు ఆటలో 90 ఓవర్లలో 4 వికెట్లకు 399 పరుగులు సాధించింది. ఆకాశ్‌ (63) రాణించాడు. 
మొహుల్‌ సెంచరీ: ఇన్‌కం ట్యాక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈఎంసీసీని మొహుల్‌ భౌమిక్‌ (125; 220 బంతుల్లో 17×4, 1×6) సెంచరీతో ఆదుకున్నాడు. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో ఈఎంసీసీ 77 ఓవర్లలో 7 వికెటలకు 247 పరుగులు చేసింది. మొహుల్‌ సెంచరీతో జట్టుకు అండగా నిలిచాడు. సాయి అభినయ్‌ (84) మెరిశాడు. ఇన్‌కం ట్యాక్స్‌ బౌలర్‌ రాజుయాదవ్‌ (4/45) రాణించాడు. 
ఎ-డివిజన్‌ మూడు రోజుల లీగ్‌: * ఆర్‌.దయానంద్‌: 284/7 (భగత్‌వర్మ 159, యతిన్‌రెడ్డి 44, రోహిత్‌రెడ్డి 39, ఆకాశ్‌ భండారి 5/94), వర్సెస్‌ ఎస్‌బీఐ, బీ జైహనుమాన్‌: 283 (శశిధర్‌రెడ్డి 58, అనిరుధ్‌రెడ్డి 72, సుమంత్‌ 53, సూర్యతేజ 43, దివేష్‌సింగ్‌ 4/41), స్పోర్టింగ్‌ ఎలెవన్‌: 38/1, * దక్షిణమధ్య రైల్వే: 151 (హేమంత్‌సింగ్‌ 69, హితేష్‌యాదవ్‌ 3/46, అమోల్‌ షిండే 4/47), ఆంధ్రాబ్యాంక్‌: 130/6 (అమోల్‌ షిండే 35 బ్యాటింగ్‌), * ఈఎంసీసీ: 247/7 (మొహుల్‌ భౌమిక్‌ 125, సాయి అభినయ్‌ 84, రాజుయాదవ్‌ 4/45), వర్సెస్‌ ఇన్‌కం ట్యాక్స్‌, * డెక్కన్‌ క్రానికల్‌: 209/5 (చిస్తీ 38, వరుణ్‌గౌడ్‌ 95 బ్యాటింగ్‌, సీవీ మిలింద్‌ 41 బ్యాటింగ్‌, ముదస్సిర్‌ 4/66) వర్సెస్‌ బీడీఎల్‌, * ఇండియా సిమెంట్స్‌: 82 (శ్రేయస్‌ 46, వినయ్‌కుమార్‌ 4/41, శ్రవణ్‌ 5/15), ఎవర్‌గ్రీన్‌: 93/3 (మనోజ్‌కుమార్‌ 37 బ్యాటింగ్‌), * ఎన్స్‌కాన్స్‌: 259/7 (సాయివ్రత్‌ 32, జునైద్‌ అలీ 52, ఒవైస్‌ 84 బ్యాటింగ్‌, అక్సారి 58, ఆశిష్‌ శ్రీవాస్తవ 5/75), వర్సెస్‌ కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌, * ఎంపీ కోల్ట్స్‌: 399/4 (వైష్ణవ్‌రెడ్డి 113, మిఖిల్‌ జైశ్వాల్‌ 142 బ్యాటింగ్‌, ఆకాశ్‌ 63, శిరీష్‌గౌడ్‌ 39 బ్యాటింగ్‌, అలీమ్‌ 3/116), వర్సెస్‌ కాంటినెంటల్‌ 
ఎ-డివిజన్‌ రెండ్రోజుల లీగ్‌: * డబ్ల్యూఎంసీసీ: 129 (వివేక్‌ 30, హర్ష్‌ పటేల్‌ 34, అభిషేక్‌ మురుగన్‌ 5/31, గగన్‌జ్యోత్‌ 3/54), స్పోర్టివ్‌ సీసీ: 130/1 (శశిధర్‌రెడ్డి 86 నాటౌట్‌), * ఖల్సా: 470/8 డిక్లేర్డ్‌, జైభగవతి: 141 (విభు 43, అమిత్‌కుమార్‌సింగ్‌ 5/57, అంకుర్‌కుమార్‌ 3/70),

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.