close
మెరిసిన పాండే, కృనాల్‌ 

వెస్టిండీస్‌-ఎపై ఇండియా-ఎ సిరీస్‌ విజయం

నార్త్‌ సౌండ్‌ (ఆంటిగ్వా): వెస్టిండీస్‌-ఎతో జరుగుతున్న అనధికార ఐదు వన్డేల సిరీస్‌లో ఇండియా-ఎ వరుసగా మూడో విజయం సాధించి మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే 3-0తో సిరీస్‌ సొంతం చేసుకుంది. మంగళవారం మ్యాచ్‌లో ఇండియా-ఎ 148 పరుగుల ఆధిక్యంతో విండీస్‌-ఎను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇండియా-ఎ 50 ఓవర్లలో 6 వికెట్లకు 295 పరుగులు సాధించింది. కెప్టెన్‌ మనీష్‌ పాండే (100; 87 బంతుల్లో 6×4, 5×6) సెంచరీతో చెలరేగగా.. శుభ్‌మన్‌ గిల్‌ (77; 81 బంతుల్లో 8×4, 1×6), శ్రేయస్‌ అయ్యర్‌ (47; 69 బంతుల్లో 4×4), హనుమ విహారి (29; 39 బంతుల్లో 3×4) రాణించారు. అనంతరం విండీస్‌-ఎ 34.2 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. కృనాల్‌ పాండ్య (5/25), విహారి (2/23) సత్తాచాటారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.