close
సింధు, శ్రీకాంత్‌ శుభారంభం 

ఇండోనేసియా ఓపెన్‌

జకార్తా: భారత స్టార్‌ క్రీడాకారులు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఐదో సీడ్‌ సింధు 11-21, 21-15, 21-15తో అయా ఒహొరి (జపాన్‌)పై విజయం సాధించింది. ఒహొరిపై సింధుకు వరుసగా ఇది ఏడో విజయం. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21-14, 21-13తో కెంట నిషిమొటొ (జపాన్‌)పై గెలుపొందాడు. సాయిప్రణీత్‌ 15-21, 21-13, 10-21తో వాంగ్‌ వింగ్‌ (హాంకాంగ్‌) చేతిలో, ప్రణయ్‌ 21-19, 18-21, 20-22తో షై యుకి (చైనా) చేతిలో ఓడారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో సాత్విక్‌ సాయిరాజు- అశ్విని పొన్నప్ప 13-21, 11-21తో విన్నీ- తొంతోటి (ఇండోనేసియా) చేతిలో పరాజయం చవిచూశారు. ప్రిక్వార్టర్స్‌లో మియాతో సింధు, లాంగ్‌ ఆగ్నస్‌ (హాంకాంగ్‌)తో శ్రీకాంత్‌ తలపడతారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.