close
మార్పులెన్నో.. చేర్పులెన్నో!

నేడే విండీస్‌ పర్యటనకు భారత జట్టు ఎంపిక

ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఓటమికి కారణమైన మిడిలార్డర్‌ సమస్యకు సెలక్టర్లు ఎలాంటి పరిష్కారం కనుగొన్నారు? ఈ ప్రశ్నకు ఆదివారం సమాధానం లభించే అవకాశముంది. వెస్టిండీస్‌ టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ల్లో పోటీపడే భారత జట్లను ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సెలక్టర్ల బృందం ఆదివారం ఎంపిక చేయనుంది. నాలుగో స్థానంలో రిషబ్‌ పంతే కొనసాగనున్నాడా.. ఓపెనింగ్‌లో కొత్త వారిని పరీక్షించనున్నారా అన్నది కూడా తేలిపోనుంది.

ముంబయి

వెస్టిండీస్‌తో ఆగస్టు 3న ప్రారంభమయ్యే పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లలో పాల్గొనే భారత జట్లను సెలక్టర్లు ఆదివారం ఎంపిక చేయనున్నారు. ఈ పర్యటనకు కెప్టెన్‌ కోహ్లి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అతడు టెస్టు సిరీస్‌ మాత్రమే ఆడతాడని మొదట వార్తలొచ్చాయి. ఆ తర్వాత అన్ని సిరీస్‌లకు అందుబాటులో ఉంటాడని తెలిసింది. సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? ధోని భవిష్యత్‌పై వారు ఎలాంటి వివరణ ఇస్తారనేది ఆసక్తికరమే.

వాళ్లకు అవకాశం వస్తుందా?: ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ కీలక సమయాల్లో దారుణంగా తడబడింది. నాలుగో స్థానం కోసం తీసుకొచ్చిన రాహుల్‌ను ధావన్‌ స్థానంలో ఓపెనర్‌కు పంపడం, నాలుగో స్థానంలో విజయ్‌ శంకర్‌, రిషబ్‌ పంత్‌లను ఆడించడం లాంటి ప్రయోగాలు చేసింది భారత్‌. ఈ నేపథ్యంలో నాలుగో స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి. భారత్‌-ఎ తరఫున ఇప్పటికే కరీబియన్‌ దీవుల్లో ఆడుతున్న మనీష్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌లకు సెలక్టర్లు అవకాశం ఇవ్వొచ్చు.

జట్టులో కొత్త పేసర్లు!: విండీస్‌ పర్యటనలో వన్డే, టీ20 సిరీస్‌లకు బుమ్రా, షమిలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ల స్థానంలో లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌తో పాటు ఐపీఎల్‌లో ఆకట్టుకున్న నవ్‌దీప్‌ సైని, దీపక్‌ చాహర్‌ జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. మరో సీనియర్‌ భువనేశ్వర్‌తో కలిసి వీళ్లు కొత్త బంతి పంచుకోవచ్చు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.