close
మెరిసిన జైశ్వాల్‌, కార్తీక్‌

భారత అండర్‌-19 జట్టు విజయం

వార్సెస్టర్‌: మూడు దేశాల అండర్‌-19 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత అండర్‌-19 జట్టు 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ అండర్‌-19 జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 46.3 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో లూయిస్‌ గోల్డ్స్‌వర్తి (58) అర్ధశతకంతో రాణించాడు. భారత బౌలర్లలో కార్తీక్‌ త్యాగి (3/35), సాగర్‌ మిశ్రా (2/39), విద్యాధర్‌ పాటిల్‌ (2/46) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో జైశ్వాల్‌ (78; 115 బంతుల్లో 9×4), దివ్యాన్ష్‌ సక్సేనా (43) సత్తాచాటడంతో.. భారత్‌ 5 వికెట్లు కోల్పోయి 39.2 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.