close
ఓడినా.. క్వార్టర్స్‌ చేరిన భారత్‌

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌

దిల్లీ: ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ (చైనా) మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగం చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఓడినా క్వార్టర్స్‌ చేరింది. ఆదివారం గ్రూప్‌- సి మ్యాచ్‌లో భారత్‌ 1-4 తేడాతో కొరియా చేతిలో ఓడింది. బాలుర సింగిల్స్‌లో మైస్నం మీరబా విజయం సాధించి భారత ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మ్యాచ్‌ల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో డింకూసింగ్‌- రితిక జోడీ 21-19, 12-21, 12-21తో డాంగ్‌ జు- జి లీ చేతిలో, బాలికల డబుల్స్‌లో తనీష- త్రీసా 16-21, 21-16, 12-21తో బిన్‌- జి లీ చేతిలో, బాలుర డబుల్స్‌లో విష్ణు వర్ధన్‌- భట్నాగర్‌ 17-21, 15-21తో డాంగ్‌ జు-యంగ్‌ కిమ్‌ చేతిలో, బాలికల సింగిల్స్‌లో మాళవిక 10-21, 8-21తో లామ్‌ కిమ్‌ చేతిలో పరాజయం పాలయ్యాయి. రెండు విజయాలతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన జట్టు తుది ఎనిమిది జాబితాలో చోటు దక్కించుకుంది. క్వార్టర్స్‌లో భారత్‌.. ఇండోనేసియాతో తలపడనుంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.