close
హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్‌ ఎంఎన్‌ రావు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ అధికారిగా జస్టిస్‌ ఎంఎన్‌ రావు ఎంపికయ్యారు. ఆదివారం జరిగిన హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు ఎన్నికల అధికారిగా వీఎస్‌ సంపత్‌ను నియమించారు. హెచ్‌సీఏ నుంచి బీసీసీఐ ప్రతినిధిగా జి.వివేకానందను నియమించినట్లు సమాచారం అందినా కూడా ఈ ఎంపికపై అధికారికంగా ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ సమావేశంలోనే జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ, క్రికెటింగ్‌ కమిటీని ఎంపిక చేశారు. సీనియర్స్‌ సెలక్షన్‌ కమిటీ బాధ్యతను క్రికెటింగ్‌ కమిటీ చూసుకోనుంది. లోథా కమిటీ సిఫార్సుల మేరకు బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. సెప్టెంబర్‌లో హెచ్‌సీఏకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ: నోయల్‌ డేవిడ్‌ (ఛైర్మన్‌), వివేక్‌ జెసిమా, రాజేశ్‌ యాదవ్‌, శివాజీ యాదవ్‌, అబ్దుల్‌ హజీమ్‌; క్రికెటింగ్‌ కమిటీ: వెంకటపతిరాజు, ఎంవీ నరసింహారావు, పూర్ణిమారావు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.