close
శ్రీశ్వాన్‌.. ఇంటర్నేషనల్‌ మాస్టర్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ చెస్‌ ఆటగాడు శ్రీశ్వాన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం) హోదా సాధించాడు. స్పెయిన్‌లో జరిగిన అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో 6 పాయింట్లు సాధించిన అతను మూడో ఐఎం నార్మ్‌ సొంతం చేసుకున్నాడు. శ్రీశ్వాన్‌ ఖాతాలో ప్రస్తుతం 2461 ఎలో రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ఐఎం హోదా సాధించాలంటే మూడు నార్మ్‌లతో పాటు 2400 ఎలో రేటింగ్‌ పాయింట్లు కలిగి ఉండాలి. శ్రీశ్వాన్‌ ఆ రెండు అర్హతలు సాధించడంతో ఐఎం హోదా సొంతమైంది. 13 ఏళ్లకే ఈ హోదా దక్కించుకొన్న శ్రీశ్వాన్‌.. తెలంగాణ నుంచి ఆ ఘనత దక్కించుకొన్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా రాష్ట్రం నుంచి ఏడో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా నిలిచాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.