Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 174956
            [news_title_telugu_html] => 

పసిడి ముచ్చట తీరేనా..!

[news_title_telugu] => పసిడి ముచ్చట తీరేనా..! [news_title_english] => [news_short_description] => బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌.. బ్యాడ్మింటన్‌లో అత్యున్నత టోర్నీ. ఇందులో పతకం సాధించడం ప్రతి షట్లర్‌ కల. భారత్‌ తరఫున ఎప్పుడో 1983లో ప్రకాశ్‌ పదుకొనే ఓ పతకం గెలిచాక.. మళ్లీ ఆ ఆశ తీరేందుకు 27 ఏళ్లు పట్టింది.  జ్వాల-అశ్విని జోడీ కరవు తీర్చేస్తూ కాంస్యం గెలిస్తే.. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
పసిడి ముచ్చట తీరేనా..! - EENADU
close
పసిడి ముచ్చట తీరేనా..!

నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్‌
మధ్యాహ్నం 12.15 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
బాసెల్‌ (స్విట్జర్లాండ్‌)

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌.. బ్యాడ్మింటన్‌లో అత్యున్నత టోర్నీ. ఇందులో పతకం సాధించడం ప్రతి షట్లర్‌ కల. భారత్‌ తరఫున ఎప్పుడో 1983లో ప్రకాశ్‌ పదుకొనే ఓ పతకం గెలిచాక.. మళ్లీ ఆ ఆశ తీరేందుకు 27 ఏళ్లు పట్టింది.  జ్వాల-అశ్విని జోడీ కరవు తీర్చేస్తూ కాంస్యం గెలిస్తే.. మన బ్యాడ్మింటన్‌ తారాజువ్వలు పి.వి. సింధు, సైనా నెహ్వాల్‌ కలిసి అయిదేళ్ల వ్యవధిలో ఏకంగా అరడజను పతకాలు సాధించి పెట్టారు. బ్యాడ్మింటన్‌ అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తారు. కానీ ఇన్ని పతకాలు సాధించినా.. అందులో పసిడి లేకపోవడం మాత్రం వెలితే.  ఈసారైనా దాన్ని అందుకోవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోన్నారు భారత షట్లర్లు. మరి పసిడి కల నెరవేరుతుందా!

బ్యాడ్మింటన్‌ ప్రియుల్ని ఉర్రూతలూగించడానికి ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సిద్ధమైంది. సోమవారమే టోర్నీకి శ్రీకారం. ప్రపంచ బ్యాడ్మింటన్‌ స్టార్లందరూ పతాక స్థాయి ఆటతో పతకం కోసం తలపడే టోర్నీ ఇది. భారత్‌ నుంచి ప్రధాన క్రీడాకారులందరూ ఈసారి టోర్నీ బరిలో ఉన్నారు. ముఖ్యంగా అందరి కళ్లూ సింధు, సైనా, శ్రీకాంత్‌ల మీదే ఉన్నాయి.

సింధు.. మంచి ఛాన్సే!
రెండు రజతాలు, రెండు కాంస్యాలు.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు ప్రదర్శన ఇది. ఒక భారత షట్లర్‌ ఇలాంటి ప్రదర్శన చేస్తుందని ఎవరూ కలలోనూ ఊహించి ఉండరు. సింధుకు స్వర్ణం గెలవడానికి 2017, 2018 టోర్నీల్లో మంచి అవకాశాలే వచ్చాయి. ఈ రెండుసార్లూ ఫైనల్లో గొప్పగా పోరాడింది హైదరాబాదీ అమ్మాయి. కానీ త్రుటిలో పసిడి చేజారింది. ఈ ఏడాది కచ్చితంగా పసిడి కల నెరవేర్చుకోవాలనే పట్టుదలతో సింధు బరిలోకి దిగుతోంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం ఒకట్రెండు టోర్నీలకు దూరంగా ఉండి గట్టిగా సన్నద్ధమైందామె. ఫిట్‌నెస్‌ మీద కూడా దృష్టిపెట్టింది. గత నెలలో ఇండోనేసియా ఓపెన్‌ రన్నరప్‌గా నిలిచి ఫామ్‌ చాటుకుంది.

సైనా.. పుంజుకుంటుందా?

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సైనా ఓ రజతం (2015), ఓ కాంస్యం (2017) నెగ్గింది. ఏడాదిగా సైనా ప్రదర్శన ఏమంత బాగా లేదు. నిరుడు కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో సత్తా చాటినా.. ఒక్క సూపర్‌ సిరీస్‌ టైటిలూ గెలవలేదు. గత ఏడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ విఫలమైంది. ఈసారి టోర్నీలో మెరిసి తన స్థాయిని చాటిచెప్పాలని సైనా ఆశిస్తోంది. ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనాకు సైతం తొలి రౌండ్లో బై లభించింది. రెండో రౌండ్లో ఆమె సబ్రినా (స్విట్జర్లాండ్‌) లేదా సొరయా డివిష్‌ (నెదర్లాండ్స్‌) ఎదురు కావచ్చు. తర్వాతి రౌండ్లో డెన్మార్క్‌ క్రీడాకారిణి మియా బ్లిచ్‌ఫెట్‌ని ఢీకొట్టాల్సి రావచ్చు. క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారిణి చెన్‌ యు ఫీ ఎదురుపడే అవకాశముంది. సెమీస్‌ చేరితే సింధుతోనే తలపడాల్సి రావచ్చు. మరి సైనా టోర్నీలో ఏమేరకు పుంజుకుంటుందో చూడాలి.

శ్రీకాంత్‌.. సత్తా చాటాల్సిందే

రెండేళ్ల కిందట వరుస సూపర్‌ సిరీస్‌ టైటిళ్లతో అదరగొట్టిన కిదాంబి శ్రీకాంత్‌.. ఆ తర్వాత అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఈ మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడు.. గత 22 నెలల్లో అతను ఒక్క సూపర్‌సిరీస్‌ టైటిల్‌ కూడా గెలవలేదు. దూకుడైన ఆటతో తనదైన రోజు ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించే శ్రీకాంత్‌.. తన స్థాయికి తగ్గ ఆట ఆడి చాలా కాలమైంది. మళ్లీ తనేంటో రుజువు చేసుకోవడానికి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కంటే మంచి వేదిక మరొకటి ఉండదు. మోకాలి గాయం నుంచి కోలుకున్న శ్రీకాంత్‌.. గత ఏడాది లాగే తొలి రౌండ్లో గుయెన్‌ (ఐర్లాండ్‌)తో తలపడతాడు. టోర్నీలో అతను ఏడో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు.

వీళ్లు కూడా..

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇంకా చాలామందే భారత క్రీడాకారులు బరిలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ తొలి రౌండ్లో జేసన్‌ ఆంటోనీ (కెనడా)తో తలపడతాడు. సమీర్‌ వర్మ.. చౌ తీన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో, ప్రణయ్‌.. హీనో (ఫిన్‌ల్యాండ్‌)తో తొలి మ్యాచ్‌లు ఆడతారు. పురుషుల డబుల్స్‌లో రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ గాయాల కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంది. సుమీత్‌ రెడ్డి-మను అత్రి, ఎంఆర్‌ అర్జున్‌-రామచంద్రన్‌ శ్లోక్‌, అర్జున్‌ జార్జ్‌-సన్యమ్‌ శుక్లా జోడీలు కూడా బరిలో ఉన్నాయి. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప, జక్కంపూడి మేఘన-పూర్విష, పూజ దండు-సంజన సంతోష్‌ జోడీలు ఆడుతున్నాయి. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రా-సిక్కిరెడ్డి కూడా బరిలోకి దిగుతున్నారు.

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత పతకాలు

* 1983 ప్రకాశ్‌ పదుకొణె (కాంస్యం)
* 2011 జ్వాల-అశ్విని (కాంస్యం)
* 2013 సింధు (కాంస్యం)
* 2014 సింధు (కాంస్యం)
* 2015 సైనా (రజతం)
* 2017 సింధు (రజతం)
    సైనా (కాంస్యం)
* 2018 సింధు (రజతం)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.