Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 174959
            [news_title_telugu_html] => 

ఉత్కంఠ రేపినా.. డ్రానే

[news_title_telugu] => ఉత్కంఠ రేపినా.. డ్రానే [news_title_english] => [news_short_description] => ఆసక్తి రేపిన యాషెస్‌ రెండో టెస్టులో ఫలితం రాలేదు. ఒక దశలో ఫలితంపై ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. చివరికి మ్యాచ్‌ డ్రాగానే ముగిసింది. 48 ఓవర్లలో 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్‌ (3/23), జాక్‌ లీచ్‌ (3/37)ల ధాటికి ఆస్ట్రేలియా విలవిలలాడింది. ముఖ్యంగా ఆర్చర్‌ నిప్పులు చెరిగే బంతులతో కంగారూ బ్యాట్స్‌మెన్‌ను కంగారెత్తించేశాడు.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
ఉత్కంఠ రేపినా.. డ్రానే - EENADU
close
ఉత్కంఠ రేపినా.. డ్రానే

ఫలితం తేలని యాషెస్‌ రెండో టెస్టు
లార్డ్స్‌

ఆసక్తి రేపిన యాషెస్‌ రెండో టెస్టులో ఫలితం రాలేదు. ఒక దశలో ఫలితంపై ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. చివరికి మ్యాచ్‌ డ్రాగానే ముగిసింది. 48 ఓవర్లలో 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్‌ (3/23), జాక్‌ లీచ్‌ (3/37)ల ధాటికి ఆస్ట్రేలియా విలవిలలాడింది. ముఖ్యంగా ఆర్చర్‌ నిప్పులు చెరిగే బంతులతో కంగారూ బ్యాట్స్‌మెన్‌ను కంగారెత్తించేశాడు. నాలుగో రోజు బౌన్సర్‌తో స్మిత్‌ను గాయపరిచిన ఆర్చర్‌.. చివరి రోజూ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ శరీరాల్నే లక్ష్యంగా చేసుకున్నాడు. అతడి బంతులు ఇద్దరు ముగ్గురిని గాయపరిచాయి. వార్నర్‌ (5), ఖవాజా (2), బాన్‌క్రాఫ్ట్‌ (16) పెవిలియన్‌కు వరుస కట్టడంతో ఆస్ట్రేలియా 14 ఓవర్లకు 47/3తో నిలిచింది. దీంతో మిగిలిన 34 ఓవర్లలో ఆస్ట్రేలియాను ఇంగ్లిష్‌ బౌలర్లు ఆలౌట్‌ చేసేస్తారేమో అనిపించింది. అయితే స్మిత్‌ స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబుషేన్‌ (59) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడికి హెడ్‌ (42 నాటౌట్‌) సహకరించడంతో ఆసీస్‌ కోలుకుంది. కానీ లబుషేన్‌, వేడ్‌ (1)లను స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేసిన లీచ్‌.. మళ్లీ ఇంగ్లాండ్‌కు ఆశలు కల్పించాడు. అయితే హెడ్‌ పట్టుదల ప్రదర్శించడంతో ఆసీస్‌ బయటపడింది. పైన్‌ (4) క్యాచ్‌ను డెన్లీ డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో అందుకోవడం చివరి రోజు ఆటలో హైలైట్‌. అంతకుముందు 96/4తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌.. 258/5 వద్ద డిక్లేర్‌ చేసింది. స్టోక్స్‌ (115 నాటౌట్‌; 165 బంతుల్లో 11×4, 3×6) అద్భుత శతకంతో అలరించాడు. బట్లర్‌ (31), బెయిర్‌స్టో (30 నాటౌట్‌)లతో అతను కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మ్యాచ్‌లో వర్షం వల్ల దాదాపు రెండు రోజుల ఆట రద్దయింది. లేకుంటే కచ్చితంగా ఫలితం వచ్చేదే. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో టెస్టు లీడ్స్‌లో శుక్రవారం ఆరంభమవుతుంది.


స్మిత్‌ సబ్‌స్టిట్యూట్‌గా లబుషేన్‌

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్నస్‌ లబుషేన్‌ టెస్టు క్రికెట్‌ తొలి కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా నిలిచాడు. స్మిత్‌ గాయంతో దూరం కావడంతో రెండో టెస్టు చివరి రోజు పూర్తిగా స్థాయి ఆటగాడిగా కొనసాగాడు. సాధారణంగా సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్‌ చేయడానికే అర్హుడు. అయితే ఐసీసీ కొత్త సబ్‌స్టిట్యూట్‌ నిబంధన ప్రకారం ఏ ఆటగాడైనా కంకషన్‌తో మ్యాచ్‌కు దూరమైతే.. అతడి స్థానంలో వచ్చే సబ్‌స్టిట్యూట్‌ తుది ఎలెవన్‌లో సభ్యుడు కిందే లెక్క. గాయపడ్డ ఆటగాడి విధులను నిర్వర్తించవచ్చు. ఉదాహరణకు ఓ బ్యాట్స్‌మన్‌ గాయంతో దూరమైతే.. అతడి సబ్‌స్టిట్యూట్‌ బ్యాటింగ్‌ చేయవచ్చు. బౌలర్‌ స్థానంలో వచ్చే సబ్‌స్టిట్యూట్‌ బౌలింగ్‌ చేయవచ్చు. ఈ నిబంధన కంకషన్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఇతర గాయాలైతే సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డింగ్‌కే పరిమితం కావాలి. కంకషన్‌తో దూరమైన ఆటగాడు ఆ మ్యాచ్‌లో మళ్లీ మైదానంలోకి దిగడానికి వీల్లేదు. రెండో టెస్టు నాలుగో రోజు ఆర్చర్‌ బౌన్సర్‌ మెడకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ మూడో టెస్టులో ఆడడం అనుమానమే. శనివారం రిటైర్డ్‌హర్ట్‌ అయ్యాక పరీక్షల్లో అంతా బాగానే ఉందని తేలడంతో తిరిగి బ్యాటింగ్‌కు దిగాడు. 92 వద్ద ఔటైన అతడు ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా ఫీల్డింగ్‌కు రాలేదు. ఆదివారం ఉదయం నిర్వహించిన కంకషన్‌ పరీక్షలో అతడి పరిస్థితి కాస్త క్షీణించినట్లు తేలింది. దీంతో అతడు ఐదో రోజు మ్యాచ్‌కు దూరమయ్యాడు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.