Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177532
            [news_title_telugu_html] => 

మణిందర్‌ మాయ

[news_title_telugu] => మణిందర్‌ మాయ [news_title_english] => [news_short_description] => ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో బంగాల్‌ వారియర్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. రైడింగ్‌లో మణిందర్‌ సింగ్‌ (10) మాయ చేయడంతో.. గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగాల్‌ 35-26 తేడాతో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
మణిందర్‌ మాయ - EENADU
close
మణిందర్‌ మాయ

పట్నాపై బంగాల్‌ విజయం
చెన్నై

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో బంగాల్‌ వారియర్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. రైడింగ్‌లో మణిందర్‌ సింగ్‌ (10) మాయ చేయడంతో.. గురువారం జరిగిన మ్యాచ్‌లో బంగాల్‌ 35-26 తేడాతో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. రింకు నర్వాల్‌ (5) ట్యాక్లింగ్‌లో సత్తాచాటాడు. మ్యాచ్‌ ఆరంభంలో పైరేట్స్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. పర్దీప్‌ నర్వాల్‌ (12) రైడింగ్‌లో మెరవడంతో ఆ జట్టు తొలి ఐదు నిమిషాలు ముగిసే సరికి 8-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రపంజన్‌ (6) రాణించడంతో తిరిగి పుంజుకొన్న బంగాల్‌ ఓ దశలో 11-11తో స్కోరు సమం చేసింది. తొలి అర్ధభాగాన్ని ఆ జట్టు 15-14తో ముగించింది. విరామం తర్వాత మణిందర్‌ చెలరేగడంతో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసిన బంగాల్‌ 19-14తో ఆధిక్యం సాధించింది. అక్కడి నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆ జట్టు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వరుసగా పాయింట్లు సాధిస్తూ.. ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లింది. మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా 34-17తో నిలిచిన బంగాల్‌ విజయం ఖాయం చేసుకుంది. చివరి వరకు ఆధిక్యాన్ని నిలుపుకొని మ్యాచ్‌ కైవసం చేసుకుంది. 9 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన బంగాల్‌.. 33 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. 9 మ్యాచ్‌ల్లో మూడే నెగ్గిన పట్నా... 17 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.

ప్రొ కబడ్డీలో ఈనాడు
గుజరాత్‌ × పట్నా
(రా.7:30 నుంచి)
తలైవాస్‌ × ముంబా
(రా.8:30 నుంచి)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.