Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177551
            [news_title_telugu_html] => 

సాయి సంచలనం

[news_title_telugu] => సాయి సంచలనం [news_title_english] => [news_short_description] => ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్‌ సంచలనం సృష్టించాడు. ప్రపంచ 8వ ర్యాంకర్‌.. ఆరో సీడ్‌ ఆంథోనీ జింటింగ్‌ (ఇండోనేసియా)కు షాకిచ్చి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సాయి 21-19, 21-13తో జింగింట్‌పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో పతకం దిశగా పి.వి.సింధు మరో అడుగు ముందుకేసింది. ఆమె అలవోకగా ప్రిక్వార్టర్స్‌ దాటింది. సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌లకు మాత్రం నిరాశ తప్పలేదు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,4, ) )
సాయి సంచలనం - EENADU
close
సాయి సంచలనం

ప్రపంచ 8వ ర్యాంకర్‌పై నెగ్గి క్వార్టర్స్‌కు
సింధు ముందంజ
సైనా, శ్రీకాంత్‌, ప్రణయ్‌ నిష్క్రమణ
ప్రపంచ బ్యాడ్మింటన్‌

ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్‌ సంచలనం సృష్టించాడు. ప్రపంచ 8వ ర్యాంకర్‌.. ఆరో సీడ్‌ ఆంథోనీ జింటింగ్‌ (ఇండోనేసియా)కు షాకిచ్చి క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సాయి 21-19, 21-13తో జింగింట్‌పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో పతకం దిశగా పి.వి.సింధు మరో అడుగు ముందుకేసింది. ఆమె అలవోకగా ప్రిక్వార్టర్స్‌ దాటింది. సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌లకు మాత్రం నిరాశ తప్పలేదు. ఈ ముగ్గురూ క్వార్టర్స్‌  చేరకుండానే నిష్క్రమించారు.

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌)

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే నాలుగు పతకాలు కొల్లగొట్టిన భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు.. ఐదో పతకానికి అడుగు దూరంలో నిలిచింది. మహిళల సింగిల్స్‌లో ఆమె క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. గురువారం ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-14, 21-6తో తొమ్మిదో సీడ్‌, అమెరికా క్రీడాకారిణి బీవెన్‌ జాంగ్‌ను అలవోకగా ఓడించింది. 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సింధుకు తొలి గేమ్‌లో సగం వరకు మాత్రమే పోటీ ఇచ్చింది. విరామ సమయానికి 11-7తో ఆధిక్యంలో ఉన్న సింధు.. ఆ తర్వాత జోరు పెంచింది. ఒక దశలో 19-10తో పైచేయి సాధించింది. దీంతో సులువుగానే గేమ్‌ ఆమె సొంతమైంది. రెండో గేమ్‌లో సింధుకు ఎదురే లేదు. జాంగ్‌ను 3 పాయింట్లలోనే ఆపి, 14 పాయింట్లకు వెళ్లిన సింధు.. అదే జోరులో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్స్‌లో రెండో సీడ్‌, చైనీస్‌ తైపీ క్రీడాకారిణి    తై జు యింగ్‌ను సింధు ఢీకొంటుంది. మహిళల సింగిల్స్‌ మరో ప్రిక్వార్టర్స్‌లో సైనా 21-15, 25-27, 12-21తో డెన్మార్క్‌ క్రీడాకారిణి మియా బ్లిచ్‌ఫెల్ట్‌ చేతిలో పరాజయం చవిచూసింది.

మరోవైపు కిదాంబి శ్రీకాంత్‌ జోరుకు ప్రిక్వార్టర్స్‌లో బ్రేక్‌ పడింది. ఏడో సీడ్‌ శ్రీకాంత్‌ 14-21, 13-21తో థాయ్‌లాండ్‌ క్రీడాకారుడు, 12వ సీడ్‌ వాంగ్‌చెరోయిన్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. రెండో రౌండ్లో దిగ్గజ ఆటగాడు లిన్‌ డాన్‌ను ఓడించిన సంచలనం సృష్టించిన ప్రణయ్‌కి టాప్‌ సీడ్‌ కెంటో మొమొటా చెక్‌ పెట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్‌ 19-21, 12-21తో పోరాడి ఓడాడు.

టీవలే జపాన్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరుకున్న సాయిప్రణీత్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ జోరు కొనసాగిస్తున్నాడు. ప్రిక్వార్టర్స్‌ పోరులో తొలి గేమ్‌లో సాయిప్రణీత్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను దాదాపుగా కోల్పోయిన సాయి అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థిని బోల్తాకొట్టించాడు. 15 పాయింట్ల వరకు సాయి, జింటింగ్‌ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. జింటింగ్‌ వరుసగా 3 పాయింట్లు నెగ్గడంతో 18-15తో గేమ్‌ అతని వైపు మొగ్గింది. ఈ సమయంలో సాయి 2 పాయింట్లు గెలిచి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 18-17కు తగ్గించాడు. జింటింగ్‌ మరో పాయింటు సాధించడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. మరో రెండు పాయింట్లు గెలిస్తే జింటింగ్‌దే తొలి గేమ్‌. ఐతే ఒక్కసారిగా చెలరేగిన సాయి వరుసగా 4 పాయింట్లు నెగ్గి 21-19తో తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. మ్యాచ్‌లో ఇదే మలుపు. రెండో గేమ్‌లో మరింత దూకుడుగా ఆడిన సాయి 6-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఐతే అనవసర తప్పిదాలు సాయిని వెనక్కి నెట్టాయి. జింటింగ్‌ ఒక్కో పాయింటు రాబడుతూ 8-6తో ఆధిక్యం సంపాదించాడు. వెంటనే అప్రమత్తమైన సాయి ఒక్కసారిగా గేరు మార్చాడు. వరుసగా 6 పాయింట్లు సాధించి 14-11తో ముందంజ వేశాడు. సాయి జోరు పెంచడంతో ప్రత్యర్థి ఆత్మరక్షణలో పడిపోయాడు. సాయి స్ట్రోక్‌లకు బదులివ్వలేక చతికిలపడ్డాడు. జింటింగ్‌ ఒక పాయింటు సాధించినా అప్పటికే అతను బాగా అలసిపోయాడు. ఇదే అదనుగా సాయి మరింత రెచ్చిపోయాడు. కళ్లు చెదిరే స్మాష్‌లతో విరుచుకుపడ్డాడు. వరుసగా 6 పాయింట్లు నెగ్గి 20-12తో మ్యాచ్‌కు చేరువయ్యాడు. ఈ సమయంలో జింటింగ్‌ సాధించిన పాయింటు ఆధిక్యాన్ని తగ్గించిందే తప్ప సాయి విజయాన్ని ఆపలేకపోయింది. అద్భుతమైన డ్రాప్‌ షాట్‌తో పాయింటు రాబట్టిన సాయి 21-13తో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు వీరిద్దరు ఐదు సార్లు తలపడగా.. మూడింట్లో సాయి, రెండింట్లో జింటింగ్‌ పైచేయి సాధించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.