Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 178712
            [news_title_telugu_html] => 

ఛాంప్స్‌ చిరెక్‌, గీతాంజలి

[news_title_telugu] => ఛాంప్స్‌ చిరెక్‌, గీతాంజలి [news_title_english] => [news_short_description] => దేవాసియా స్మారక అంతర్‌ పాఠశాల బాస్కెట్‌బాల్‌ టోర్నీలో చిరెక్‌ పబ్లిక్‌ పాఠశాల, గీతాంజలి దేవశాల జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,4, ) )
ఛాంప్స్‌ చిరెక్‌, గీతాంజలి - EENADU
close
ఛాంప్స్‌ చిరెక్‌, గీతాంజలి

అంతర్‌ పాఠశాల బాస్కెట్‌బాల్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: దేవాసియా స్మారక అంతర్‌ పాఠశాల బాస్కెట్‌బాల్‌ టోర్నీలో చిరెక్‌ పబ్లిక్‌ పాఠశాల, గీతాంజలి దేవశాల జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి. బాలుర విభాగంలో చిరెక్‌, బాలికల విభాగంలో గీతాంజలి టైటిళ్లు సొంతం చేసుకున్నాయి. శనివారం జరిగిన బాలుర ఫైనల్లో చిరెక్‌ 45-17 తేడాతో దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ను చిత్తుచేసింది. ఆరంభం నుంచి ఆధిపత్యం చలాయిస్తూ ఆడిన చిరెక్‌ ఏ దశలోనూ వెనక్కు తగ్గలేదు. ప్రత్యర్థిపై పూర్తి స్థాయిలో విరుచుకుపడి అలకోకగా విజయాన్ని నమోదు చేసింది. తొలి అర్ధభాగాన్ని 28-12తో ముగించిన ఆ జట్టు విరామం తర్వాత మరింత రెచ్చిపోయి ఆడింది. వరుస పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. చిరెక్‌ తరపున రోహన్‌ (8), అరుణ్‌ (6), రిత్విక్‌ (6).. దిల్లీ జట్టులో విశ్వనాథ్‌ (8), కృతిన్‌ (6) రాణించారు. బాలికల తుదిపోరులో గీతాంజలి 60-42తో దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌పై విజయం సాధించింది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో ముందంజ వేసిన గీతాంజలి జట్టు.. టైటిల్‌ పోరులోనూ అదే జోరు కనబరచింది. ఛాంపియన్‌గా నిలవాలనే కసితో ఆడిన ఆ జట్టు క్రీడాకారిణులు ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. ప్రథమ అర్ధభాగం ముగిసే సరికి 30-15తో ఆధిక్యం సంపాదించిన ఆ జట్టు... ద్వితీయార్థంలోనూ చెలరేగి మ్యాచ్‌ కైవసం చేసుకుంది. గీతాంజలి తరపున రుచి (28), జోషిక (20), తన్విత (13)... దిల్లీ జట్టులో హర్షిత (12), అదితి (10), ఖుషీ (8) మెరిశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.