Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 178717
            [news_title_telugu_html] => 

పాంథర్స్‌ను పట్టేసిన విశాల్‌

[news_title_telugu] => పాంథర్స్‌ను పట్టేసిన విశాల్‌ [news_title_english] => [news_short_description] => ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో ఆలస్యంగా పుంజుకొన్న తెలుగు టైటాన్స్‌ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. విశాల్‌ భరద్వాజ్‌ (8) ట్యాక్లింగ్‌లో చెలరేగి ప్రత్యర్థిని ఓ పట్టుపట్టడంతో శనివారం.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,4, ) )
పాంథర్స్‌ను పట్టేసిన విశాల్‌ - EENADU
close
పాంథర్స్‌ను పట్టేసిన విశాల్‌

జైపుర్‌పై టైటాన్స్‌ విజయం

దిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో ఆలస్యంగా పుంజుకొన్న తెలుగు టైటాన్స్‌ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. విశాల్‌ భరద్వాజ్‌ (8) ట్యాక్లింగ్‌లో చెలరేగి ప్రత్యర్థిని ఓ పట్టుపట్టడంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 24-21 తేడాతో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలిచింది. ఈ సీజన్‌లో టైటాన్స్‌కిది మూడో విజయం. విశాల్‌ ఆరంభం నుంచే సత్తాచాటడంతో టైటాన్స్‌ పది నిమిషాలు ముగిసే సరికి 7-4తో ఆధిక్యంలో నిలిచింది. తిరిగి పుంజుకున్న జైపుర్‌ ఆటగాళ్లు 8-8తో స్కోరు సమం చేశారు. ట్యాక్లింగ్‌లో సందీప్‌ ధూల్‌ (4), రైడింగ్‌లో అజింక్య పవార్‌ (3) పాయింట్లు తేవడంతో జైపుర్‌ తొలి అర్ధభాగాన్ని 14-11తో ముగించింది. విరామం తర్వాత విశాల్‌ అండతో టైటాన్స్‌ పట్టుబిగించింది. అతను సూపర్‌ ట్యాకిళ్లు చేయడంతో జట్టు 15-15తో స్కోరు సమం చేసింది. అక్కడి నుంచి పోరు రసవత్తరంగా మారింది. ఆధిపత్యం చేతులు మారుతూ సాగింది. 32వ నిమిషంలో అబోజర్‌ సూపర్‌ ట్యాకిల్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. 19-17తో ఆధిక్యం సాధించిన టైటాన్స్‌ పట్టు వదల్లేదు. చివరి రెండు నిమిషాల ఆట ఉందనగా 21-22తో ప్రత్యర్థి స్కోరు సమం చేసేలా కనిపించింది. కానీ మరో ట్యాకిల్‌ పాయింట్‌తో అబోజర్‌ జట్టుకు 23-21తో ఆధిక్యం అందించాడు. చివరి రైడ్లో ఫర్హద్‌ పాయింట్‌తో టైటాన్స్‌ స్పష్టమైన ఆధిక్యంతో మ్యాచ్‌ సొంతం చేసుకుంది. 10 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో టైటాన్స్‌.. 23 పాయింట్లతో తొమ్మిదో స్థానానికి చేరింది. హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌లో దబంగ్‌ దిల్లీ 33-31తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.

ప్రొ కబడ్డీలో ఈనాడు
జైపుర్‌ × బెంగళూరు (రా.7:30 నుంచి)
దిల్లీ × యూపీ (రా.8:30 నుంచి)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.