close
మెరిసిన బాలాజి

రాణించిన హర్షిత్‌, వివేక్‌
ఎ- డివిజన్‌ వన్డే లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హెచ్‌పీఎస్‌ (రామంతపూర్‌) ఓపెనర్‌ దుర్గ బాలాజి (109; 98 బంతుల్లో 20×4) శతకంతో చెలరేగాడు. అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చూడ ముచ్చటైన బ్యాటింగ్‌తో అలరించాడు. మైదానం నలుమూలలా బౌండరీలు బాదుతూ సెంచరీ సాధించాడు. బాలాజి శతకం సాయంతో ఆదివారం జరిగిన ఎ- డివిజన్‌ వన్డే లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో హెచ్‌పీఎస్‌ 68 పరుగుల తేడాతో ఆక్రిలిక్‌ సీసీని చిత్తుచేసింది. టాస్‌ గెలిచి ముందు బ్యాటింగ్‌కు దిగిన హెచ్‌పీఎస్‌ 27.2 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. బాలాజి సెంచరీతో ఆదుకోకపోయుంటే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. ఓ ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా కూడా పట్టుదలగా క్రీజులో నిలిచిన అతను జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ప్రత్యర్థి బౌలర్లలో రాజు (3/28), వంశీ (2/48), శ్రీరామ్‌ (2/15) విజృంభించి హెచ్‌పీఎస్‌ని కట్టడి చేశారు. అనంతరం ఛేదనలో ఆక్రిలిక్‌ సీసీ 28.3 ఓవర్లలో 104 పరుగులకే కుప్పకూలింది. రిశ్విత్‌ (3/18), తేజశ్విన్‌ (2/1), వ్యాస్‌ (2/22) సత్తాచాటి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు.

రాణించిన వివేక్‌, జావెద్‌: బ్యాటింగ్‌లో వివేక్‌ (100; 80 బంతుల్లో 10×4) సెంచరీతో, బౌలింగ్‌లో జావెద్‌ అలీ ఖాన్‌ (5/28) ఐదు వికెట్లతో రాణించడంతో షాలిమార్‌ సీసీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌షైన్‌ సీసీ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌షైన్‌ సీసీ 44.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. వివేక్‌ శతకంతో జట్టును ముందుండి నడిపించాడు. అతని అద్భుత ఇన్నింగ్స్‌ సాయంతో ఆ జట్టు పోరాడే స్కోరు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో రాజబ్‌ అలీ (5/43) ఐదు వికెట్లతో విజృంభించాడు. బదులుగా బ్యాటింగ్‌ ఆరంభించిన షాలిమార్‌ సీసీ.. జావెద్‌ ధాటికి 29.5 ఓవర్లలో 221 పరుగులకే కుప్పకూలి పరాజయం మూటగట్టుకుంది. ఆ జట్టులో అర్ష్‌ (52), శామ్స్‌ (56) అర్ధ శతకాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. జావెద్‌తో పాటు జావెద్‌ ఖాన్‌ (3/60), కార్తీక్‌ (2/33) కూడా మెరిసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.

హర్షిత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన: సత్య సీసీ ఆటగాడు హర్షిత్‌ (4/44, 110 నాటౌట్‌) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అద్భుతం చేశాడు. అతను బ్యాట్‌, బంతితో చెలరేగడంతో ఎస్‌ఏ అంబర్‌పేట్‌తో జరిగిన మ్యాచ్‌లో సత్య సీసీ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అంబర్‌పేట్‌ 39.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో చందు (72) టాప్‌స్కోరర్‌. బౌలింగ్‌లో హర్షిత్‌తో పాటు రిషి (2/32) కూడా రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సత్య సీసీ.. హర్షిత్‌ శతకం సాయంతో ఐదు వికెట్లు కోల్పోయి 31.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ప్రత్యర్థి బౌలర్లలో గౌతమ్‌ (3/43), జునైద్‌ (2/31) ఆకట్టుకున్నారు.
ఎ- డివిజన్‌ వన్డే లీగ్‌:
* హెచ్‌పీఎస్‌ (రామంతపూర్‌): 172 (దుర్గ బాలాజి 109, వంశీ 2/48, రాజు 3/28, శ్రీరామ్‌ 2/15), ఆక్రిలిక్‌ సీసీ: 104 (సత్య 21, వ్యాస్‌ 2/22, రిశ్విత్‌ 3/18, తేజశ్విన్‌ 2/1);* సన్‌షైన్‌ సీసీ: 271 (వివేక్‌ 100, వంశీ 29, దర్శ్‌ 29, రజబ్‌ అలీ 5/43, ముస్తాఫా 3/46), షాలిమార్‌ సీసీ: 221 (అర్ష్‌ 52, శ్యామ్స్‌ 56, జావెద్‌ అలీ ఖాన్‌ 5/28, జావెద్‌ ఖాన్‌ 3/60, కార్తీక్‌ 2/33); * ఏకలవ్య సీసీ: 258 (విమల్‌ దేవ్‌ 76, తేజ 82, బాలా 3/58, మధువీర్‌ రెడ్డి 3/30), ఆల్‌ సెయింట్స్‌: 186/2 (చరిత్‌ రెడ్డి 67 నాటౌట్‌, రజాక్‌ బిన్‌ అలీ 93); * హైదరాబాద్‌ పేట్రియాట్స్‌: 44 (రామ్‌ చంద్ర 26, ధీరజ్‌ 5/27, కోటేశ్‌ 4/17), ఏబీ కాలనీ: 45/0 (సౌరవ్‌ 21 నాటౌట్‌, కోటేశ్‌ 18 నాటౌట్‌); * అంబర్‌పేట్‌: 170 (చందు 72, హర్షిత్‌ 4/44, రిషి 2/32), సత్య సీసీ: 171/5 (హర్షిత్‌ 110 నాటౌట్‌, గౌతమ్‌ 3/43, జునైద్‌ 2/31); * ఎన్‌ఎన్‌ గ్రూప్‌: 233/5 (అతర్వ 98, ఆర్యమన్‌ 45, నిశాంత్‌ 36), సికింద్రాబాద్‌ జింఖానా: 92 (సిద్ధార్థ్‌ 29, హితేశ్‌ 5/9, నిశాంత్‌ 4/30)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.