Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 179433
      [news_title_telugu_html] => 

ఈ రాకెట్‌..  ఆగదు

[news_title_telugu] => ఈ రాకెట్‌..  ఆగదు [news_title_english] => [news_short_description] => ఒలింపిక్స్‌ పతకమైనా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ విజయమైనా.. అతిగా పొంగిపోవడం.. ఇక చాలు అనుకోవడం.. సింధుకు అలవాటు లేని విషయాలు. ఎంత పెద్ద విజయం సాధించినా కూడా.. తర్వాత ఏంటి? అనుకోవడమే ఆమెకు తెలుసు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [news_sections] => ,4, ) )
ఈ రాకెట్‌..  ఆగదు - EENADU
close
ఈ రాకెట్‌..  ఆగదు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

అది 2012... చైనా మాస్టర్స్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ.. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఆ ఏడాది ఒలింపిక్స్‌ (లండన్‌ 2012) స్వర్ణ విజేత లీ బరిలో నిలిచింది. అవతలి వైపు ప్రత్యర్థేమో.. అంతర్జాతీయ స్థాయిలో అప్పుడే తన ప్రస్థానం మొదలెడుతున్న ఓ పదిహేడేళ్ల అమ్మాయి. అలాంటిది ఏకంగా ఒలింపిక్‌ ఛాంపియన్‌తో పోరు అనగానే ఆ అమ్మాయి ఏ మాత్రం పోటీ ఇవ్వగలదని అంతా సందేహించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. అద్భుతమైన ప్రదర్శనతో తనకంటే ఎంతో మెరుగైన లీని చిత్తుచేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లోకి తన ఆగమనాన్ని ఘనంగా చాటింది. ఆ అమ్మాయి ఎవరో కాదు.. తాజాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన మన సింధూనే. నిలకడైన ఆటతీరుతో సంచలనాలు నమోదు చేయడం అలవాటుగా మార్చుకున్న ఆమె విజయ ప్రయాణం నిరాటంకంగా సాగుతోంది. మరే షట్లర్‌కు సాధ్యం కాని రీతిలో ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్నా కూడా ఆమె విజయాల ఆకలి తీరట్లేదు.

ఒలింపిక్స్‌ పతకమైనా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ విజయమైనా.. అతిగా పొంగిపోవడం.. ఇక చాలు అనుకోవడం.. సింధుకు అలవాటు లేని విషయాలు. ఎంత పెద్ద విజయం సాధించినా కూడా.. తర్వాత ఏంటి? అనుకోవడమే ఆమెకు తెలుసు. ఆ లక్షణమే తనను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపింది. ప్రపంచ స్థాయి టోర్నీల్లో విజయం సాధించగానే.. ఒక్కసారిగా పేరు, ప్రఖ్యాతులు రావడంతో ఆట మీద నుంచి దృష్టి మరలి.. కెరీర్‌లో వెనకబడ్డ క్రీడాకారులు ఎంతో మంది. కానీ ఎన్ని ఘనతలు చెంతచేరినా.. ఎవరికీ సాధ్యం కాని విజయాలు దక్కినా.. ఈ తెలుగు తేజం ఆగలేదు. కీర్తి చట్రంలో చిక్కుకోకుండా.. దేనిపై వ్యామోహం పెంచుకోకుండా.. కేవలం ఆట మీదే శ్రద్ధ పెట్టిన ఆమె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే క్రీడాకారిణిగా అవతరించింది. ఎనిమిదేళ్ల వయసులో రాకెట్‌ పట్టినప్పటి నుంచి.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం అందుకునే దాకా ఆమె ఎక్కడా విశ్రమించలేదు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతంతో కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరిన ఆమె అలసత్వాన్ని దరిచేరనియ్యలేదు. ఇదివరకే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నాలుగు పతకాలు గెలుచుకున్నా కూడా సంతృప్తి చెందలేదు. తను సాధించాల్సింది ఇంకా ఉందని తలచి.. తన పతక వేటను కొనసాగించింది. కాబట్టే ప్రపంచ ఛాంపియన్‌ పసిడి ఆమె చెంత వాలింది.

‘‘పి.వి.సింధు మరోసారి భారత్‌ను గర్వపడేలా చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఆమెకు అభినందనలు. మరోవైపు 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌లో కాంస్యం గెలిచిన భమిడిపాటి సాయిప్రణీత్‌కు శుభాకాంక్షలు’’ 

- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

సైనాను మించి

సైనా నెహ్వాల్‌.. గొప్ప ప్రదర్శనతో భారత బ్యాడ్మింటన్‌ను సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన మేటి క్రీడాకారిణి. ఆమెకు జూనియర్‌గా వచ్చిన సింధు.. సైనా తర్వాతేనని అంతా అనుకున్నారు. కానీ సైనా (2015) కంటే ముందే 2013లోనే సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం విశేషం. ఐతే ఆ గెలుపు ఏదో గాలివాటమని భావించి ఆమెను మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆమె ఎలాంటి ప్రతికూలతలను దగ్గరికి రానివ్వలేదు. పట్టుదలతో సాధన చేసింది. అడ్డంకులను అధిగమించింది. సైనా తర్వాత సింధు అనుకునే స్థాయి నుంచి.. సైనాను మించి దిగ్గజంగా నిలిచింది. అదేంటో కానీ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ అంటే మాత్రం సింధూకు ఎక్కడలేని పూనకం వచ్చేస్తుంది. రాకెట్‌ తిరుగులేని ఆయుధంగా మారి.. ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ విజయాల వైపు పరుగులు పెడుతుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి ముందు ఈ ఏడాది సింధు ఒక్క టైటిల్‌ కూడా నెగ్గలేదు. దాంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె ఎలా రాణిస్తుందోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఒక్కసారి టోర్నీ మొదలయ్యాక ఆమె టాప్‌గేర్‌లోకి వచ్చేసింది. ఇంతకుముందు తనను ఓడించిన ప్రత్యర్థులను చిత్తుచేస్తూ పోడియంపై అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయంతో చరిత్ర సృష్టించడమే కాకుండా.. సిల్వర్‌ స్టార్‌ అని తనమీద పడిన ముద్రను తొలగించుకున్నట్లైంది. ఫైనల్‌ ఫోబియోతో గత రెండు పర్యాయాలు విశ్వవిజేతగా నిలిచే అవకాశం చేజార్చుకున్న ఆమె ఈ సారి పూర్తిస్థాయిలో చెలరేగి టైటిల్‌ను ఒడిసిపట్టుకుంది. ఇక ఆమె ఖాతాలో చేరాల్సింది.. ఒలింపిక్స్‌ స్వర్ణం ఒక్కటే. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ నేపథ్యంలో సింధు తాజా ప్రదర్శన ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందనడంలో సందేహం లేదు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ ఆమె ఇదే జోరు కొనసాగించి పసిడి పతకాన్ని సొంతం చేసుకోవాలనేదే అందరి ఆకాంక్ష.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.