Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119007798
            [news_title_telugu_html] => శ్రీశాంత్‌xనెల్‌: గెలిచిందెవరంటే..
            [news_title_telugu] => శ్రీశాంత్‌xనెల్‌: గెలిచిందెవరంటే..
            [news_title_english] => Sreesanth vs Andre Nel: who is the winner
            [news_short_description] => ఈ నెల 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్‌ మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. సఫారీలతో సిరీస్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు ఎన్నో జ్ఞాపకాలు. వాటిలో భారత ఫాస్ట్‌ బౌలర్‌..

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [news_sections] => ,4301,
        )

)
శ్రీశాంత్‌xనెల్‌: గెలిచిందెవరంటే.. - Sreesanth vs Andre Nel: who is the winner - EENADU
close
శ్రీశాంత్‌xనెల్‌: గెలిచిందెవరంటే..

ఈ నెల 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్‌ మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. సఫారీలతో సిరీస్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు ఎన్నో జ్ఞాపకాలు. వాటిలో భారత ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌x దక్షిణాఫ్రికా పేసర్ ఆండ్రీ నెల్‌ మధ్య జరిగిన పోరు ఎంతో ఆసక్తికరం. దీనిని క్రికెట్‌ అభిమానులు ఎప్పటికీ మరవలేనిది. నిప్పులు చెరిగే బంతుల్ని విసురుతున్న నెల్‌కు శ్రీశాంత్‌ ఇచ్చిన సమాధానం అప్పట్లో హైలైట్‌. మరో కొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీశాంత్‌xనెల్‌ మధ్య జరిగిన పోరుని ఓ సారి చూద్దాం..!


అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీశాంత్‌ 2005లో అరంగ్రేటం చేశాడు. తొలుత ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. కొన్ని నెలల తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తీసి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. దీంతో జట్టులో అతడి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అతడి మేనరిజానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ఉండేవారు. కవ్వించే ప్రత్యర్థులను ముకుతాడు వేయడంలో అతడు సిద్ధహస్తుడు. మైదానంలో అతడి దూకుడుని అందరూ ఆస్వాదించేవారు. కానీ ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అతడి కెరీర్‌కు అనూహ్యంగా తెరపడింది. సాఫీగా సాగుతున్న అతడి క్రికెట్‌ ప్రయాణానికి అది ఊహించని మలుపు. 

కెరీర్‌ ప్రారంభించిన ఆరు నెలల్లోపే టెస్టుల్లో చోటు సంపాదించాడు. 2006లో సఫారీ పర్యటనకు ఎంపికయ్యాడు. ఫార్మాట్‌ ఏదైనా దూకుడే నా స్టైల్‌ అనేలా అతడు మైదానంలో కదిలేవాడు. ఎప్పుడూ బౌలింగ్‌తోనే ప్రతర్థులకు సమాధానమిచ్చే అతడు బ్యాట్‌తో కూడా ఓ సారి తన సత్తా చాటాడు. దీంతో అతడు ఆనందంతో మైమరిచి మైదానంలోనే చిందేసాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్‌ఇండియా సఫారీలతో మూడు టెస్టులు ఆడింది. సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో చేజార్చుకుంది. అయినా అభిమానులకు ఈ సిరీస్‌ మంచి జ్ఞాపకంగానే మిగిలిపోయింది. దానికి కారణం శ్రీశాంత్‌. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్‌ ఆండ్రీ నెల్‌ నిప్పులు చెరిగే బంతులు విసురుతున్నాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీశాంత్‌ను నెల్‌ కవ్వించాడు. దీంతో అతడికి సరైన సమాధానం చెప్పాలని శ్రీశాంత్‌ భావించాడు. ఒక అడుగు ముందువేసి భారీ షాట్‌ ఆడాడు. బంతి నేరుగా వెళ్లి స్టాండ్స్‌లో పడింది. అంతే.. వెంటనే బ్యాట్‌ను గిరగిర తిప్పుతూ శ్రీశాంత్‌ స్టెప్పులు వేశాడు. సిక్సర్‌ను చూసి ఏమి చేయాలో తెలియక నెల్‌ నిస్సహాయంగా ఉండిపోయాడు.

సిక్సర్‌ బాదిన అనంతరం తను ఎందుకు డాన్స్‌ వేసాననే విషయాన్ని అతడు ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. నెల్‌ తనని కవ్వించాడని, అందుకే అలా చేశానని తెలిపాడు. ‘‘టీవీలో నా డాన్స్‌ను చూసి ఆశ్చర్యపోయా! నేను బ్యాటింగ్‌కు వచ్చిన వెంటనే నెల్‌ నన్ను రెచ్చగొట్టాడు. ‘నువ్వు పిరికివాడివి. నీకు ధైర్యం లేదు. తర్వాత బంతికే నిన్ను ఔట్‌ చేస్తాను’ అని నెల్ నాతో కయ్యానికి కాలు దువ్వాడు. నాతో సంభాషించిన తర్వాత వికెట్‌కీపర్‌ మార్క్‌ బౌచర్‌ను కొంచెం వెనక్కి వెళ్లమన్నాడు. అంతేకాకుండా షార్ట్‌లెగ్‌ ఫీల్డర్‌ స్థానాన్ని కూడా మార్చాడు. ఇప్పుడు అతడు బౌన్సర్ విసురుతాడని నాకు అర్థమైంది. నాకు అవకాశం ఇవ్వమని దేవుడిని ప్రార్థించాను. నెల్‌ వేసిన బంతిని ఒక అడుగు ముందుకు వేసి బలంగా బాదాను. అది బౌండరీ అవతల పడింది. ఆనందంతో చిందేశాను’’ అని తెలిపాడు.   

భారత విజేతగా నిలిచిన 2007 టీ20‌, 2011 వన్డే ప్రపంచకప్‌ జట్టులో శ్రీశాంత్‌ ఉన్నాడు. ఉత్కంఠ పతాక స్థాయికి చేరిన 2007 టీ20 ఫైనల్లో శ్రీశాంత్‌ క్యాచ్‌ను అభిమానులు మరువలేరు. పాకిస్థాన్‌తో జరిగిన తుదిపోరులో మిస్బా ఫైన్‌లెగ్‌ మీదుగా బాదిన బంతిని అతడు ఒడిసి పట్టుకున్నాడు. అతడు క్యాచ్‌ అందుకోకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. 2011 ప్రపంచకప్‌లో కూడా శ్రీశాంత్ ఫర్వాలేదనిపించాడు. అతడు పరిస్థితులను బట్టి రాణించగలడని జట్టు అతడిపై నమ్మకం ఉంచేది. ‘జట్టులో శ్రీశాంత్‌ ఉంటే అదృష్టం కలిసోస్తుంది. అతడు లక్కీ ఛార్మ్‌’ అని శ్రీశాంత్‌ను ఉద్దేశిస్తూ ధోనీ అన్న మాటలివి. సాఫీగా సాగుతున్న అతడి క్రికెట్‌ కెరీర్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్న అతడిపై 2013లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. అతడితో పాటు అజిత్‌ చండీలా, అంకిత్‌ చవాన్‌పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. తనపై నిషేధం ఎత్తివేయాలని అతడు న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. ఇటీవల సుప్రీంకోర్టు అతడిపై నిషేధం తొలగించడంతో బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. దీంతో వచ్చే ఏడాది ఆగస్టుకు అతడి శిక్ష ముగుస్తుంది. తిరిగి భారత జట్టులో చోటు సంపాదిస్తానని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు. 36 ఏళ్ల శ్రీశాంత్‌ తిరిగి టీమ్‌ఇండియాలో పునరాగమనం చేస్తాడో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే! 

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.