close
ఫైనల్లో తరుణ్‌, మేఘన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: తెలంగాణ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ షట్లర్లు తరుణ్‌ రెడ్డి, మేఘన రెడ్డి జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో తరుణ్‌, మహిళల సింగిల్స్‌లో మేఘన ఫైనల్లో అడుగుపెట్టారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని రైల్వే ఇండోర్‌ స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో తరుణ్‌ 19-21, 21-17, 21-15 తేడాతో పుల్లెల సాయి విష్ణుపై విజయం సాధించాడు. మరో సెమీస్‌లో తరుణ్‌ (ఖమ్మం) 21-8, 21-16తో ఆదిత్య గుప్తా (హైదరాబాద్‌)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో మేఘన 21-8, 21-13తో డీవీ లయపై నెగ్గి తుదిపోరుకు చేరింది. మరో మ్యాచ్‌లో అభిలాష (హైదరాబాద్‌) 23-21, 21-15తో భార్గవి (రంగారెడ్డి)పై పైచేయి సాధించి టైటిల్‌ పోరులో మేఘనతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. పురుషుల డబుల్స్‌లో శ్రీకృష్ణ సాయి- విష్ణు వర్ధన్‌ జోడీ 21-17, 21-13తో వెంకట్‌- సాయి విష్ణుపై, ఆకాశ్‌- సాయి జంట 21-13, 21-14తో అభీష్‌- అజయ్‌ ద్వయంపై నెగ్గి ఫైనల్‌ చేరాయి. మహిళల డబుల్స్‌లో భార్గవి- వైష్ణవి, అభిలాష- శ్రీవిద్య జోడీలు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.