close
విజేత షేక్‌పేట

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల క్రీడలు

షేక్‌పేట, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా స్థాయి (రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలు) క్రీడల్లో షేక్‌పేట పాఠశాల సత్తాచాటింది. అండర్‌-17 ఫుట్‌బాల్‌లో షేక్‌పేట విజేతగా నిలిచింది. ఫైనల్లో శివారెడ్డిపేట పాఠశాలపై షేక్‌పేట విజయం సాధించింది. అండర్‌-19 ఫుట్‌బాల్‌లో శంషాబాద్‌ ప్రథమ, హయత్‌నగర్‌ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. అండర్‌-17 వాలీబాల్‌లో పరిగి ప్రథమ, కందుకూరు ద్వితీయ స్థానాలు సాధించాయి. అండర్‌-19 వాలీబాల్‌లో ఇబ్రహీంపట్నం ప్రథమ, పరిగి ద్వితీయ స్థానాలు సొంతం చేసుకున్నాయి. 12 పాఠశాలల నుంచి 350 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. బహుమతి ప్రదానోత్సవంలో గురుకుల విద్యాలయాల సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త ఉదయభాస్కర్‌, కార్యనిర్వాహక కార్యదర్శి హరికిషన్‌, టెక్నికల్‌ మేనేజర్‌ రమేశ్‌, షేక్‌పేట పాఠశాల ప్రిన్సిపల్‌ వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.