close
మెరిసిన హర్షిత్‌, కరణ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: బ్యాటింగ్‌లో హర్షిత్‌ (168 నాటౌట్‌) భారీ శతకంతో చెలరేగడంతో పాటు బౌలింగ్‌లో కరణ్‌ యాదవ్‌ (5/23) సత్తాచాటడంతో సత్య సీసీ జట్టు ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌లో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు రెండు వికెట్ల తేడాతో యూనివర్సల్‌ సీసీపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన యూనివర్సల్‌ 39.5 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో షకీర్‌ (89), హుజైఫా (71 నాటౌట్‌) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. కరుణ్‌ ఐదు వికెట్లతో రాణించి ప్రత్యర్థి జట్టుకు కళ్లెం వేశాడు. అనంతరం ఛేదనలో హర్షిత్‌ అద్భుత ఇన్నింగ్స్‌ సాయంతో సత్య సీసీ 43 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్‌గా బరిలో దిగిన హర్షిత్‌ చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఇమ్రాన్‌ (3/49), షకీర్‌ (3/29) చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌: సెయింట్‌ మేరీస్‌: 94 (సాదత్‌ అలీ ఖాన్‌ 26, హరికృష్ణ 3/6, నీరజ్‌ 2/12, తనిష్క్‌ 2/13); విజయ్‌నగర్‌ సీసీ: 95/4 (క్షితిజ్‌ రెడ్డి 35 నాటౌట్‌, కౌశిక్‌ 24, తేజస్‌ 3/28); యూనివర్సల్‌: 262 (షకీర్‌ 89, హుజైఫా 71 నాటౌట్‌, కరణ్‌ యాదవ్‌ 5/23), సత్య సీసీ: 267/8 (హర్షిత్‌ 168 నాటౌట్‌, ఇమ్రాన్‌ 3/49, షకీర్‌ 3/29); అంబర్‌పేట్‌ సీసీ: 315/6 (సంజయ్‌ 104 నాటౌట్‌, వినాస్‌ 66 నాటౌట్‌, రిషికేశ్‌ యాదవ్‌ 3/75), రుషిరాజ్‌ సీసీ: 175/6 (సాధ్విక్‌ రెడ్డి 73 నాటౌట్‌, రిజ్వాన్‌ 2/38);  వీపీడబ్ల్యూఎం: 225 (అయాన్‌ 71 నాటౌట్‌, దీపాన్షు 67, రామ్‌గుప్తా 4/31), సాగర్‌ ఎలెవన్‌ సీసీ: 133 (ఆయూబ్‌ ఖాన్‌ 7/30); యాదవ్‌ డైరీ: 233/7 (చరణ్‌ దీప్‌ 55, శుభమ్‌ 45), విక్టోరియా సీసీ: 226/9 (రాకేశ్‌ 73, నిశ్చయ్‌ 4/32); సౌత్‌ఎండ్‌ రేమండ్స్‌: 172 (మహమ్మద్‌ షైజాన్‌ 60, మధువీర్‌ రెడ్డి 5/45, రజాక్‌ 3/45); ఆల్‌ సెయింట్స్‌: 159 (జాస్పర్‌ 43 నాటౌట్‌)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.