close
నిహాల్‌, అధిబన్‌ నిష్క్రమణ

చెస్‌ ప్రపంచకప్‌

ఖాంటీ మాన్‌సీస్క్‌ (రష్యా): చెస్‌ ప్రపంచకప్‌లో భారత పదిహేనేళ్ల గ్రాండ్‌మాస్టర్‌ నిహాల్‌ సరీన్‌ పోరాటం ముగిసింది. ఆదివారం రెండో రౌండ్‌ ర్యాపిడ్‌ టైబ్రేకర్‌లో అతను 0.5-1.5 తేడాతో ఎల్తాజ్‌ (అజర్బైజాన్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. రెండో రౌండ్‌ తొలి గేమ్‌లో ప్రత్యర్థిపై గెలిచిన నిహాల్‌.. రెండో గేమ్‌లో పరాజయం చెందడంతో టైబ్రేకర్‌ ఆడాల్సి వచ్చింది. మరోవైపు అధిÅబన్‌కు కూడా ఓటమి ఎదురైంది. టైబ్రేకర్‌లో అతను 0.5-1.5తో యూ యాంగ్‌యి (చైనా) చేతిలో చిత్తయ్యాడు. వీళ్లిద్దరూ ఓటమితో వెనుదిరగడంతో ప్రస్తుతం ప్రపంచకప్‌లో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణతో పాటు విదిత్‌ గుజరాతి మాత్రమే మిగిలి ఉన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.