close
ప్రిక్వార్టర్స్‌లో కవిందర్‌

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

ఎక్తరిన్‌బర్గ్‌ (రష్యా): ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు కవిందర్‌ సింగ్‌ (57 కేజీ),  సంజీత్‌ (91 కేజీ) ప్రిక్వార్టర్‌ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. ఆదివారం హోరాహోరీగా సాగిన రెండో రౌండ్‌ పోరులో కవిందర్‌ 3-2తో చైనాకు ఎందిన చెనా జిహావోపై విజయం సాధించాడు. కవిందర్‌ పంచ్‌లకు ప్రత్యర్థి ముఖం రక్తసిక్తమైంది. మరో పోరులో సంజీత్‌ 4-1తో స్కాట్‌ ఫారెస్ట్‌ (స్కాట్లాండ్‌)ను ఓడించాడు. మరో భారత బాక్సర్‌ బ్రిజేశ్‌ యాదవ్‌కు మాత్రం నిరాశ తప్పలేదు. అతడు 4-1తో టర్కీకి చెందిన మల్కమ్‌ చేతిలో ఓడిపోయాడు. అమిత్‌ పంగాల్‌ (52 కేజీ), మనీష్‌ కౌశిక్‌ (63 కేజీ) ఇప్పటికే ప్రిక్వార్టర్స్‌ చేరిన సంగతి తెలిసిందే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.