close
పంకజ్‌ అడ్వాణీ @ 22

ఖాతాలో మరో ప్రపంచ  టైటిల్‌ భారత దిగ్గజ క్యూ ఆటగాడు పంకజ్‌ 

అడ్వాణీకి.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నట్లుంది. ఇప్పటికే క్యూ క్రీడల్లో (బిలియర్డ్స్‌, స్నూకర్‌) 21 ప్రపంచ టైటిళ్లు సొంతం చేసుకున్న అతను.. తాజాగా మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఐబీఎస్‌ఎఫ్‌ ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌లో విజయకేతనం ఎగరవేసి సత్తాచాటాడు. 150 అప్‌ ఫార్మాట్లో అతనికిది వరుసగా నాలుగో ఫైనల్‌ విజయం. ఈ బిలియర్డ్స్‌ ఫార్మాట్‌లో గత ఆరేళ్లలో అతనికిది ఐదో ప్రపంచ టైటిల్‌.

మాన్‌డలె (మయన్మార్‌)

పంకజ్‌ అడ్వాణీ ఖాతాలో మరో ప్రపంచ టైటిల్‌ చేరింది. ఆదివారం ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ 150 అప్‌ ఫార్మాట్‌ ఫైనల్లో పంకజ్‌ 6-2 తేడాతో స్థానిక ఆటగాడు నా తవెపై గెలిచాడు. అతని దూకుడు ముందు ప్రత్యర్థి తేలిపోయాడు. తొలి మూడు ఫ్రేమ్‌ల్లో నెగ్గి 3-0తో ఆధిక్యం సాధించిన పంకజ్‌ మ్యాచ్‌ను త్వరగానే ముగించేలా కనిపించాడు. కానీ నాలుగో ఫ్రేమ్‌లో గెలిచిన తవె.. పంకజ్‌ విజయాన్ని ఆలస్యం చేశాడు. ఆ తర్వాత రెండు ఫ్రేమ్‌ల్లో మళ్లీ పంకజ్‌దే పైచేయి. అనంతరం ప్రత్యర్థి ఓ విజయం సాధించినప్పటికీ.. తర్వాతి ఫ్రేమ్‌లో పంకజ్‌ గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. గతేడాది ఫైనల్లో కూడా పంకజ్‌.. నా తవెపై గెలవడం విశేషం. ‘‘ఈ ఫార్మాట్లో గత నాలుగేళ్ల నుంచి వరుసగా ప్రపంచ టైటిళ్లు.. గత ఆరేళ్లలో మొత్తం ఐదు సార్లు విజేతగా నిలవడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ బరిలో దిగిన ప్రతిసారి విజేతగా నిలవాలనే నా ప్రేరణ తగ్గలేదని నిరూపించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. నా విజయాల ఆకలి, నా సత్తాను ఈ టైటిల్‌ మరోసారి రుజువు చేసింది’’ అని పంకజ్‌ తెలిపాడు. బిలియర్డ్స్‌లో విశ్వవిజేతగా నిలిచిన అతను.. ఇక స్నూకర్‌లో సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం నుంచే ఐబీఎస్‌ఎఫ్‌ ప్రపంచ సిక్స్‌ రెడ్‌ స్నూకర్‌, ప్రపంచ   టీమ్‌ స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లు ఆరంభం కానున్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.