close
ప్రిక్వార్టర్స్‌లో సింధు.. సైనా ఇంటిముఖం

చాంగ్‌జౌ (చైనా): చైనా ఓపెన్‌ సూపర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్‌ క్రీడాకారిణులు పి.వి.సింధు శుభారంభం చేయగా.. సైనా నెహ్వాల్‌ ఇంటిముఖం పట్టింది. బుధవారం మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ప్రపంచ ఛాంపియన్‌, ఐదో సీడ్‌ సింధు 21-18, 21-12తో ఒలింపిక్‌ మాజీ విజేత లీ జురుయ్‌ (చైనా)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. కేవలం 35 నిమిషాల్లోనే జురుయ్‌ ఆటకట్టించిన సింధు ఆమెపై తన గెలుపోటముల రికార్డును 4-3కు పెంచుకుంది. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా 10-21,   17-21తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో సాయిప్రణీత్‌ 21-19, 21-23, 21-14తో సుపన్యు (థాయ్‌లాండ్‌)పై, పారుపల్లి కశ్యప్‌ 21-12, 21-15తో బ్రైస్‌ లెవెర్‌దెజ్‌పై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప 21-13, 11-8 (రిటైర్డ్‌)తో చెన్‌ యా- లీ చెన్‌ (చైనీస్‌ తైపీ)పై నెగ్గి ముందంజ వేశారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.