close
క్వార్టర్స్‌లో ప్రణీత, వరుణి

రాష్ట్ర ర్యాంకింగ్‌ టీటీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: డాక్టర్‌ ఎంవీ శ్రీధర్‌ స్మారక రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో ప్రణీత, వరుణి జైస్వాల్‌ సత్తాచాటుతున్నారు. హైదరాబాద్‌ జిల్లా టీటీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో వీళ్లిద్దరు క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. గురువారం ఏడబ్ల్యూఏ స్పోర్ట్స్‌ అకాడమీలో జరిగిన ప్రి క్వార్టర్స్‌లో ప్రణీత (హెచ్‌వీఎస్‌) 4-0 (11-7, 11-7, 11-3, 11-9) తేడాతో హనీఫా (వీపీజీ)పై, వరుణి (జీఎస్‌ఎం) 4-0 (11-6, 11-9, 11-5, 11-4)తో నిఖిత (ప్రొ టీటీ)పై విజయాలు సాధించారు. మిగతా మ్యాచ్‌ల్లో మోనిక (జీఎస్‌ఎం) 4-2 (5-11, 11-1, 12-10, 9-11, 11-4, 11-8)తో రచన (జీఎస్‌ఎం)పై, లాస్య (ఏడబ్ల్యూఏ) 4-3 (8-11, 11-6, 7-11, 8-11, 11-6, 15-13, 11-8)తో వినిచిత్ర (జీఎస్‌ఎం)పై, శృష్ఠి (ఏసీఎస్‌సీ) 4-1 (11-7, 12-14, 11-8, 11-3, 11-5)తో కీర్తన (హెచ్‌వీఎస్‌)పై, రాఘ నివేదిత (జీటీటీఏ) 4-0 (11-9, 11-3, 11-9, 11-4)తో ఇష్కిత (ఏడబ్ల్యూఏ)పై నెగ్గారు. యూత్‌ బాలికల విభాగంలోనూ ప్రణీత, వరుణి క్వార్టర్స్‌ చేరారు. ప్రి క్వార్టర్స్‌లో ప్రణీత 4-0 (11-3, 11-2, 11-2, 11-5)తో యషిక జైన్‌ (ఎల్బీఎస్‌)పై, వరుణి 4-0 (11-5, 11-2, 11-8, 11-9)తో నిఖితపై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో వరుణ్‌ శంకర్‌ (ఎంఎల్‌ఆర్‌), మహమ్మద్‌ అలీ (ఎల్బీఎస్‌) రెండో రౌండ్లో అడుగుపెట్టారు. తొలి రౌండ్లో వరుణ్‌ 4-1 (11-3, 9-11, 11-7, 11-9, 11-6)తో అఖిల్‌ (ఏడబ్ల్యూఏ)పై, అలీ 4-2 (9-11, 11-6, 9-11, 11-3, 11-7, 11-7)తో వృషిన్‌ (సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల)పై జయకేతనం ఎగరవేశారు. యూత్‌ బాలుర విభాగంలో అలీ 3-0 (11-7, 11-5, 11-7)తో సాయి కిరణ్‌ (ఏడబ్ల్యూఏ)పై, విశాల్‌ (జీఎస్‌ఎం) 3-0 (14-12, 11-2, 11-4)తో విధూర్‌పై, వాత్సిన్‌ (వీఎన్నార్‌వీజేఐటీ) 3-1 (11-6, 11-7, 10-12, 11-7)తో అనూప్‌పై పైచేయి సాధించారు. అంతకుముందు మాజీ మంత్రి వినోద్‌ ముఖ్య అతిథిగా హాజరై టోర్నీని ఆరంభించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.