close
మార్‌క్రమ్‌, ముల్దర్‌ శతకాలు

దక్షిణాఫ్రికా-ఎ 400 ఆలౌట్‌

మైసూరు: భారత్‌-ఎ, దక్షిణాఫ్రికా-ఎ మధ్య రెండో అనధికార టెస్ట్‌ డ్రా దిశగా సాగుతోంది.  ఓవర్‌నైట్‌ స్కోరు 159/5తో మూడో రోజు, గురువారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా 400 పరుగులు చేసింది. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (161), ముల్దర్‌ (131 నాటౌట్‌) శతకాలతో ఆ జట్టును ఆదుకున్నారు. వీళ్లిద్దరు ఆరో వికెట్‌కు 155 పరుగులు జోడించారు. కుల్‌దీప్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నదీమ్‌ మూడు వికెట్లు, సిరాజ్‌ రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. 17 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించిన భారత్‌-ఎ.. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.