close
మెరిసిన ప్రియ

దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో భారత్‌ ఘనవిజయం

వడోదర: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు.. వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. గాయపడ్డ స్మృతి మంధాన స్థానంలో ఓపెనింగ్‌ చేసిన ప్రియ పునియా (75 నాటౌట్‌; 124 బంతుల్లో 8×4), మరో ఓపెనర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (55; 65 బంతుల్లో 7×4) సత్తా చాటడంతో బుధవారం తొలి వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 41.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించాక జెమీమా ఔటవగా.. ఆ తర్వాత పూనమ్‌ రౌత్‌ (16), మిథాలీ రాజ్‌ (11 నాటౌట్‌)లతో కలిసి ప్రియ మిగతా పని పూర్తి చేసింది. అంతకుముందు జులన్‌ గోస్వామి (3/33), శిఖ పాండే (2/38), ఏక్తా బిష్ఠ్‌ (2/28), పూనమ్‌ యాదవ్‌ (2/33)ల ధాటికి దక్షిణాఫ్రికా 45.1 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. మరిజాన్‌ కాప్‌ (54; 64 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్‌. ఓపెనర్‌ స్మృతి మంధాన గాయంతో దక్షిణాఫ్రికా మూడు వన్డేల సిరీస్‌కు దూరమైంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.