close
విజృంభించిన నిశ్చల్‌

సత్య సీసీ విజయం
ఎ- డివిజన్‌ వన్డే లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సత్య సీసీ బౌలర్‌ నిశ్చల్‌ (4/5) నాలుగు వికెట్లతో విజృంభించాడు. పదునైన బంతులతో ప్రత్యర్థి భరతం పట్టాడు. అతను రాణించడంతో ఆదివారం రాజు సీఏతో జరిగిన ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో సత్య సీసీ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజు సీఏ.. నిశ్చల్‌ ధాటికి 24.3 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఆదర్శ్‌ (40) టాప్‌ స్కోరర్‌. బౌలింగ్‌లో నిశ్చల్‌తో పాటు ఆది (2/17) కూడా మెరిశాడు. అనంతరం ఛేదనలో సత్య సీసీ మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. ఆ జట్టులో రాహుల్‌ (31 నాటౌట్‌), ఆది (31 నాటౌట్‌) బ్యాట్‌తో మెరిసి జట్టుకు విజయాన్ని అందించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఆదర్శ్‌ (3/30) మూడు వికెట్లు పడగొట్టాడు.
ఆకట్టుకున్న బౌలర్లు: మహమ్మద్‌ సలే అమోది (3/11), మహమ్మద్‌ జైర్‌ (3/9) చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో విజయ్‌నగర్‌తో జరిగిన మ్యాచ్‌లో బాయ్స్‌టౌన్‌ 44 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన బాయ్స్‌టౌన్‌ 25 ఓవర్లలో 9 వికెట్లకు 14 పరుగులు చేసింది. ఆ జట్టులో సల్మాన్‌ ఖాన్‌ (39) బ్యాట్‌తో రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో తనిష్క్‌ (2/17), సాయి కిరణ్‌ (2/31) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బదులుగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన విజయ్‌నగర్‌ 23.3 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో కౌశిక్‌ (47) పోరాడాడు. అమోది, సలే పోటీపడీ మరీ వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు.

ఎ3- డివిజన్‌ వన్డే లీగ్‌: * రాజు సీఏ: 93 (ఆదర్శ్‌ 40, ఆది 2/17, నిశ్చల్‌ 4/5), సత్య సీసీ: 94/3 (రాహుల్‌ 31 నాటౌట్‌, ఆది 31 నాటౌట్‌, ఆదర్శ్‌ 3/30); బాయ్స్‌ టౌన్‌: 143/9 (సల్మాన్‌ఖాన్‌ 39, హసన్‌ ఖాన్‌ 26, తనిష్క్‌ 2/17, సాయికిరణ్‌ 2/31), విజయ్‌నగర్‌: 99 (కౌశిక్‌ 47, మహమ్మద్‌ జైర్‌ 3/9, మహమ్మద్‌ సలే అమోది 3/11); సీక్రెడ్‌ హార్ట్‌ సీసీ: 90 (వ్యోమకేష్‌ 4/16, విఘ్నేశ్‌ 3/7), సికింద్రాబాద్‌ జింఖానా: 65 (జెరాద్‌ 3/20, జేమ్స్‌ 2/13, అగస్టిన్‌ 2/18)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.