close
బీసీసీఐకి షాక్‌.. ఎఫ్‌టీపీకి చౌదరి ఓటు

ముంబయి: బీసీసీఐకి షాక్‌. దుబాయ్‌లో ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశానికి బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరిని అనుమతించవద్దంటూ సీఓఏ రాసిన లేఖను.. ఐసీసీ ఛైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పట్టించుకోలేదు. సమావేశంలో పాల్గొని ఓటు వేసేందుకు చౌదరికి అతడు అనుమతిచ్చాడు. ప్రతి ఏడాదీ ఓ ఐసీసీ టోర్నీని నిర్వహించాలని ప్రతిపాదిస్తూ రూపొందించిన ఎఫ్‌టీపీ (2023-31)కి అనుకూలంగా చౌదరి ఓటు వేశాడు. మూడేళ్లకోసారి వన్డే ప్రపంచకప్‌ను, ప్రతి ఏటా టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాలన్న ఐసీసీ ఆలోచనను బీసీసీఐ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.రాంచీలో చౌదరిపై ఓ కేసు నడుస్తోంది. దీంతో ఏ హోదాలోనూ విధులు నిర్వర్తించకుండా సీఓఏ అతణ్ని నిషేధించింది. ఈ విషయమే బీసీసీఐ సీఈఓ ఐసీసీకి ఈమెయిల్‌లో తెలిపాడు. ఐసీసీ సమావేశంలో పాల్గొనే అర్హత అతడికి లేదని స్పష్టం చేశాడు. కానీ ఫలితం లేకపోయింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.