
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్‌లో సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌ల కథ తొలి రౌండ్లోనే ముగిసింది. బుధవారం మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో 8వ సీడ్ సైనా 15-21, 21-23తో సయాక తకహాషి (జపాన్) చేతిలో ఓడింది. తొలి గేమ్‌లో 7-4తో ఆధిక్యం సంపాదించిన సైనా ఆ తర్వాత క్రమంగా వెనుకబడింది. కొద్దిసేపటికే 15-21తో తొలి గేమ్ కోల్పోయింది. రెండో గేమ్‌లో సైనా పోరాడినా ఫలితం లేకపోయింది. 16-20తో మ్యాచ్ కోల్పోయే దశలో సైనా గొప్పగా ఆడింది. వరుసగా 4 పాయింట్లు సాధించి 20-20తో స్కోరును సమం చేసింది. కానీ చివరికి తకహాషిదే పైచేయి అయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 14-21, 18-21తో అండర్స్ అంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో సమీర్‌వర్మ 21-11, 21-11తో కాంటా సునెయామా (జపాన్)పై విజయం సాధించాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కిరెడ్డి- ప్రణవ్ చోప్రా 21-16, 21-11తో సిడెల్- లిండా (జర్మనీ)పై నెగ్గి ముందంజ వేశారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- 8 మంది.. 8 గంటలు
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన