close
ఆషామాషీ కాదు

తెరమీద ‘ఐరన్‌ మ్యాన్‌’ అద్భుత విన్యాసాలెన్నో చూసి ఉంటారు. కల్పనకు హద్దులేముంటాయి? ఏమైనా రాయొచ్చు. ఏమైనా తీయొచ్చు. ఏమైనా చూపించొచ్చు! కానీ నిజ జీవితంలో ‘ఐరన్‌ మ్యాన్‌’ అనిపించుకోవాలంటే మాత్రం గజ ఈతగాళ్లను జయించాలి. ప్రపంచ స్థాయి సైక్లిస్టుల్ని ఓడించాలి. మహా మహా అథ్లెట్లకు దీటుగా నిలవాలి!

నీటిలో ఒక 50 మీటర్ల దూరం ఈత కొడితే ఆయాసపడిపోతాం. అలాంటిది 3.86 కిలోమీటర్ల దూరం ఈదుతూ వెళ్లడమంటే మాటలా? సైకిలేసుకుని ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కాళ్లు పీకేస్తాయి. అలాంటిది 180 కిలోమీటర్లకు పైగా సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. ఇక 40కి పైగా కిలోమీటర్ల దూరం పరుగెత్తడమన్నా మాటలు కాదు. కిలోమీటర్లకు కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్లిపోయే స్విమ్మర్లుంటారు. వందల కిలోమీటర్లు సైకిల్‌పై దూసుకెళ్లే క్రీడాకారులూ ఉంటారు. మారథాన్‌ పోటీల్లో అథ్లెట్ల ప్రదర్శన గురించి తెలిసిందే. అయితే ఒక క్రీడ ఎంచుకుని అందులో నైపుణ్యాన్ని ప్రదర్శించడం వేరు. కానీ ఈ మూడింట్లోనూ ఒకరే నైపుణ్యం చూపించాల్సి వస్తే.. వెంటవెంటనే ఈ మూడు పోటీల్లో బరిలోకి దిగి.. నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయడమంటే సవాలే. ఆ సవాల్‌ను ఛేదించే వాళ్లనే ‘ఐరన్‌ మ్యాన్‌’ అంటుంది ప్రపంచ ట్రయథ్లాన్‌ కార్పొరేషన్‌. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సామర్థ్య పోటీని నిర్వహిస్తుంది ఈ సంస్థ.

ఏమిటీ పోటీ?: ఏటా నిర్వహించే ‘ఐరన్‌ మ్యాన్‌’ పోటీలో కఠినాతి కఠినమైన మూడు దశలుంటాయి. ఉదయం 7 గంటలకు మొదలయ్యే ఈత పోటీ కాల పరిమితి 2 గంటల 20 నిమిషాలు. ఈ వ్యవధిలోనే 3.86 కిలోమీటర్ల దూరం ఈదేయాలి. తర్వాత సైక్లింగ్‌ పోటీ మొదలవుతుంది. 8 గంటల 10 నిమిషాల్లో 180.25 కిలోమీటర్ల లక్ష్యాన్ని అందుకోవాలి. తర్వాత 42.20 కిలోమీటర్ల మారథాన్‌ పూర్తి చేయడానికి కాలపరిమితి ఆరున్నర గంటలు. అర్ధరాత్రికల్లా ఈ మూడు పోటీలూ పూర్తవుతాయి. ఈ మూడు దశల్నీ విజయవంతంగా అధిగమిస్తే ఆ వ్యక్తిని ‘ఐరన్‌ మ్యాన్‌’గా గుర్తిస్తారు.

- ఈనాడు క్రీడావిభాగం.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.