close
కుర్రాడి ఖలేజా

విజయ్‌ హజారెలో యశస్వి జైశ్వాల్‌ డబుల్‌ సెంచరీ
లిస్ట్‌-ఎలో ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు
బెంగళూరు

దేశవాళీ క్రికెట్లో ముంబయి కుర్రాడు యశస్వి జైశ్వాల్‌ సంచలనాలు కొనసాగుతున్నాయి. వివిధ వయసు విభాగాల మ్యాచ్‌ల్లో ఇప్పటికే చక్కటి ప్రదర్శన చేసిన యశస్వి.. ఇప్పుడు సీనియర్‌ స్థాయిలోనూ అదరగొడుతున్నాడు. 17 ఏళ్ల ఈ కుర్రాడు విజయ్‌ హజారె వన్డే ట్రోఫీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ బాది ఔరా అనిపించాడు. లిస్ట్‌-ఎ క్రికెట్లో డబుల్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా యశస్వి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఎడమ చేతి వాటం ఓపెనర్‌ అయిన అతను.. బుధవారం బెంగళూరులో ఝార్కండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 154 బంతులెదుర్కొని 17 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 203 పరుగులు చేశాడు. మరో ఓపెనర్‌ ఆదిత్య తారె (78) కూడా రాణించడంతో మొదట ముంబయి 3 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం ఝార్కండ్‌ 319 పరుగులకు ఆలౌటవడంతో ముంబయి 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
* ఈ మ్యాచ్‌ సమయానికి యశస్వి వయసు 17 ఏళ్ల 292 రోజులు. లిస్ట్‌-ఎ క్రికెట్లో డబుల్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు అతనే.
* వారం క్రితమే కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌ విజయ్‌ హజారె టోర్నీలోనే 212 పరుగులతో దేశవాళీ లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. అతడి తర్వాత అత్యుత్తమ స్కోరు యశస్విదే.
* గత ఏడాదే వీర్‌ కౌశల్‌ 202 పరుగులతో భారత దేశవాళీ లిస్ట్‌-ఎ మ్యాచ్‌ల్లో తొలి డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు.
* ఈ మ్యాచ్‌లో యశస్వి సిక్సర్లు12. విజయ్‌ హజారె  మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు.
* 21వ  శతాబ్దంలో పుట్టి  లిస్ట్‌-ఎలో ద్విశతకం బాదిన తొలి ఆటగాడు  యశస్వినే.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.