close
నాకౌట్‌ దశకు బీహెచ్‌ఈఎల్‌

వార్షిక బాస్కెట్‌బాల్‌ లీగ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: వార్షిక లీగ్‌ బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో బీహెచ్‌ఈఎల్‌ దూసుకెళ్తోంది. హైదరాబాద్‌ జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఆ జట్టు నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. గురువారం హోరాహోరీగా సాగిన పోరులో బీహెచ్‌ఈఎల్‌ 69-66 తేడాతో బిగ్‌టైమ్‌ బాలెర్స్‌పై విజయం సాధించింది. ఆరంభం నుంచి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌ ఆసాంతం మంచి వినోదాన్ని పంచింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి బీహెచ్‌ఈఎల్‌ 30-31తో నిలిచి ఒక పాయింట్‌తో వెనకబడింది. విరామం తర్వాత కూడా మ్యాచ్‌ పోటాపోటీగానే సాగింది. రెండు జట్లు పాయింట్ల వేటలో పట్టుదల ప్రదర్శించాయి. దాంతో మరో నిమిషం ఆట మిగిలి ఉందనగా స్కోర్లు 64-64తో సమమయ్యాయి. ఆ దశలో వరుసగా పాయింట్లు సాధించిన బీహెచ్‌ఈఎల్‌ ఆధిక్యం సంపాదించింది. చివరి వరకూ ఆ ఆధిక్యాన్ని కాపాడుకుని మ్యాచ్‌ సొంతం చేసుకుంది. బీహెచ్‌ఈఎల్‌ జట్టులో భరత్‌ (24), కార్తీక్‌ (8), హరీశ్‌ (8), డేవ్‌ (6)... బిగ్‌టైమ్‌ బాలెర్స్‌ తరపున ఈశ్వర్‌ (21), సంతోశ్‌ (18), శివ్‌ (18) రాణించారు. మరో మ్యాచ్‌లో భవన్స్‌ 58-44తో కేవీబీఆర్‌ను చిత్తుచేసింది. భవన్స్‌ తరపున శ్రేయస్‌ (19), హరి (12).. కేవీబీఆర్‌ జట్టులో రాజు (13), రాజా (13), శ్రావణ్‌ (13) ఆకట్టుకున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.