close
ఫ్యూచర్‌ కిడ్స్‌కు ఫుట్‌బాల్‌ టైటిళ్లు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-14 ఫుట్‌బాల్‌ టోర్నీలో ఫ్యూచర్‌ కిడ్స్‌ పాఠశాల జట్లు సత్తాచాటాయి. బాలబాలికల విభాగాల్లో టైటిళ్లు సొంతం చేసుకున్నాయి. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన బాలుర ఫైనల్లో ఫ్యూచర్‌ కిడ్స్‌ 2-1తో ఫీనిక్స్‌ గ్రీన్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (ఎ)పై గెలిచింది. కన్హా, రికీ చెరో గోల్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు. బాలికల తుదిపోరులో ఫ్యూచర్‌ కిడ్స్‌ 1-0తో యూరో కిడ్స్‌పై నెగ్గింది. అక్షయ రాజేంద్ర గోల్‌ చేసింది. స్విమ్మింగ్‌ అండర్‌-16 బాలుర 100మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో హనుమాన్‌ (విజ్ఞాన్‌ విద్యాలయ), బాలికల విభాగంలో కశ్యపి (జాన్సన్‌ గ్రామర్‌) పసిడి పతకాలు దక్కించుకున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.